ప్రభాస్ తో నిజం కాదు అని తేల్చి చెప్పిన అమ్మడు

Keerthy Suresh not working with prabhas in Adipurushయంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, నాలుగు రోజుల క్రితం ఒక పీరియడ్ చిత్రం – ఆదిపురుష్ ను తన తదుపరి చిత్రం గా ప్రకటించారు. తన్హాజీ ఫేమ్ ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇది అతని మొదటి స్ట్రెయిట్ బాలీవుడ్ చిత్రం కానుంది. బాహుబలి విజయం తర్వాత ప్రభాస్‌కు ఉన్న అపూర్వ ఆదరణ కారణంగా ఈ ప్రకటన దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది.

ADVERTISEMENT

ఈ చిత్రం 2022 లో విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమాలో మహానటి ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపిస్తుందని రెండు రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజం లేదని… ఈ చిత్రం కోసం ఇప్పటివరకు తనను ఎవరూ సంప్రదించలేదని ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూలో కంఫర్మ్ చేసింది.

అయితే ఈ సినిమా కోసం ప్రభాస్ సరసన ఒక బాలీవుడ్ భామని నటింప చెయ్యాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఇంకా టైం ఉండటంతో వారు ఎటువంటి కంగారు లేదు అంటున్నారు. రాధే శ్యామ్ తరువాత ప్రభాస్ చెయ్యబోయే తదుపరి చిత్రంలో దీపికా పడుకొనే హీరోయిన్ గా నటిస్తుంది. ఆ సాంప్రదాయాన్నే కంటిన్యూ చేసే అవకాశం ఉందట.

మరోవైపు… ప్రభాస్ రాధే శ్యామ్ షూటింగ్‌ ను సెప్టెంబర్ రెండో వారం నుండి తిరిగి ప్రారంభించడానికి నిర్ణయించుకున్నాడు. ఈ చిత్రం ఈ సంవత్సరం దసరా కోసం విడుదల కావాల్సి ఉంది, కానీ ఇప్పుడు 2021 వేసవి సెలవుల సందర్భంగా విడుదల అయ్యే అవకాశం ఉంది.

ADVERTISEMENT
Latest Stories