హీరోయిన్ భావన ఘటనపై సిఎం వ్యాఖ్యలు!

Kerala Chief Minister Responds on Actress Bhavana Molestationమాలీవుడ్ టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న భావనపై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఉదంతం తెలిసిందే. మాజీ కారు డ్రైవర్ సునీల్ కుమార్ వేసిన స్కెచ్ నేపధ్యంలో జరిగిన ఈ ఘటనలో ప్రస్తుత కారు డ్రైవర్ మార్టిన్ మినహా మరెవరినీ పోలీసులు అదుపులోకి తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక సెలబ్రిటీకి సంబంధించిన కేసులోనే పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సామాన్యులకు ఏ మాత్రం న్యాయం జరుగుతుందో అంటూ మండిపడుతుండడంతో, కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ స్పందించక తప్పలేదు.

హీరోయిన్ భావనను లైంగిక వేధింపులకు గురిచేసిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసామని చెప్పిన ముఖ్యమంత్రి విజయన్, ఈ ఘటనలో బాధ్యులైన పతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రానికి మాయని మచ్చలా మిగులుతాయని, ముఖ్యంగా మహిళల భద్రతలను ప్రశ్నార్ధకం చేస్తాయని చెప్పిన సిఎం, భావనకు న్యాయం జరిగేలా చేస్తామని అన్నారు. సునీల్ తో సహా అతనికి సహకరించిన నిందితులంతా పరారీలో ఉన్న విషయం తెలిసిందే.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories