Kesineni Nani Quits Politics

నాడు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రా ప్రజల ఆగ్రహానికి భయపడి చాలా మంది కాంగ్రెస్‌ నేతలు రాజకీయ సన్యాసం చేశారు. ధైర్యం చేసి ఎన్నికలలో పోటీ చేసినవారిని ప్రజలు మట్టి గరిపించారు.

Also Read – మే 2…ఏపీ భవిష్యత్ ను నిర్దేశించనుందా.?

ఇప్పుడు వైసీపిలో నేతలు కూడా రాజకీయ సన్యాసం తీసుకోవడం మినహా మరో దారి లేకుండా పోయింది…. అని అనే కంటే వారికి తనతో ఉండటం తప్ప మరోదారి లేకుండా జగన్‌ చేశారని చెప్పవచ్చు.

ఈ 5 ఏళ్ళలో వారిచేత టిడిపి, జనసేన నేతలు, కార్యకర్తలని చివరికి వారి కుటుంబ సభ్యులను చాలా వేధించారు. ఏనాడూ ఇంటి గడప దాటి బయటకు రాని భువనేశ్వరి, అన్నా లేజ్నేవ వంటి మహిళల గురించి వైసీపి నేతల చేత చాలా అనుచితంగా మాట్లాడించారు.

Also Read – సైన్యానికి పూర్తి స్వేచ్ఛ…దేనికి సంకేతం..?

కనుక వైసీపిలో ఎవరికీ టిడిపి, జనసేన, బీజేపీలలో చేరేందుకు అవకాశం లేకుండా చేశారు. ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా ఎవరూ కూడా జగన్‌ని వీడిపోలేరు. కొందరు జగన్‌తో సహా జైలుకి వెళ్ళాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదు. కనుక వారి ముందున్న ఏకైక మార్గం రాజకీయ సన్యాసం చేయడమే.

మాజీ ఎంపీ కేశినేని నాని అందరి కంటే ముందు ఈ విషయం గ్రహించి రాజకీయ సన్యాసం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. అంటే వైసీపిని వీడుతున్నట్లే!

Also Read – కాంగ్రెస్‌ హస్తంలో నుంచి ఆ ఆయుధం బీజేపి లాగేసుకుందిగా?

ఇంతకాలం తనను విజయవాడ ప్రజలు ఎంతగానో ఆదరించారని, తాను కూడా రెండుసార్లు ఎంపీగా వారికి చాలా సేవ చేశానని ఇక ముందు కూడా ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని కేశినేని నాని రోటీన్ చిలుక పలుకులు పలికారు. కానీ ఇంకా జగన్‌తో ఉంటే ఎదురయ్యే కష్టాలు భరించడం కష్టమని అప్పుడే గోడ దూకేస్తున్నారని భావించవచ్చు.

ఆనాడు ఏపీ కాంగ్రెస్‌ నేతలు ప్రజాగ్రహానికి భయపడి రాజకీయ సన్యాసం చేశారు. ఇప్పుడు వైసీపి నేతలు టిడిపి కూటమి ఆగ్రహానికి భయపడి పారిపోవడానికి దారులు వెతుకొంటున్నారని కేశినేని నాని చూపారు.

జగన్‌ భస్మాసురిడిలా తనని తాను నాశనం చేసుకోవడమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని, చివరికి వైసీపి నేతల రాజకీయ భవిష్యత్‌ని కూడా నాశనం చేశారనుకోవచ్చు.

తెలంగాణలో కేసీఆర్‌ని గుడ్డిగా నమ్ముకున్న బిఆర్ఎస్ పార్టీ నేతలకు ఇతర పార్టీలలో వెళ్ళిపోయేందుకు నేటికీ అవకాశం ఉంది. కానీ వైసీపి ముఠాలో ఏ ఒక్కరూ ఇతర పార్టీలలో చేరలేని దుస్థితి నెలకొంది. మా నమ్మకం మా భవిష్యత్‌ నువ్వే అనుకుంటే, ఇప్పుడు రాజకీయాలలో ఉండలేని పరిస్థితి కల్పించారు జగన్మోహన్‌ రెడ్డి. బహుశః దేశంలో మరే పార్టీ అధినేత, తన పార్టీ నేతలకు ఇటువంటి దుస్థితి కల్పించి ఉండరు.