బాలయ్య ఎఫెక్ట్… చిరంజీవి వెనక్కి..!

khaidi-no-150-gautamiputra-satakarni-audio-functionsసంక్రాంతికి విడుదల కాబోయే రెండు పెద్ద సినిమాలలో తొలుత మెగాస్టార్ చిరంజీవి “ఖైదీ నంబర్ 150” బాగా హంగామా చేసింది. అయితే ఇదంతా బాలకృష్ణ “గౌతమీపుత్ర శాతకర్ణి” ధియేటిరికల్ ట్రైలర్ విడుదల కానంతవరకే! ట్రైలర్ అదిరిపోయే రీతిలో ఉండడంతో ఒక్కసారిగా ఆధిపత్యం తలక్రిందులైంది. అప్పటినుండి ‘ఖైదీ’ డిఫెన్సులో పడిపోయారు. ఓ పక్కన విడుదల అవుతున్న పాటలు అంతంత మాత్రంగానే ఉందన్న టాక్ కు తోడు, మరో పక్కన ‘శాతకర్ణి’ డామినేషన్ తో ‘ఖైదీ’ ప్లాన్స్ మారిపోయాయి.

ముందుగా ఇచ్చిన తేదీల ప్రకారం 25వ తేదీన ‘ఖైదీ,’ 26వ తేదీన ‘శాతకర్ణి’ ఆడియోలు విడుదల కావాల్సి ఉంది. అయితే బాలకృష్ణ సినిమా ఆడియోలో ఎలాంటి మార్పులు జరగలేదు గానీ, చిరు మాత్రం వెనక్కి తగ్గారు. ఏకంగా ఆడియో వేడుకనే రద్దు చేయడంతో పాటు 25వ తేదీన పాటలను నేరుగా మార్కెట్ లోకి విడుదల చేస్తామని చేసిన ప్రకటన కూడా కార్యరూపం దాల్చలేదు. అంతేకాదు, ఎప్పుడు విడుదల చేస్తున్నామనే దానిపై కూడా స్పష్టత ఇవ్వలేదు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఆడియో విడుదల తర్వాత వచ్చిన స్పందనను బట్టి ‘ఖైదీ నంబర్ 150’కి ముహూర్తాన్ని ఖరారు చేసే ఆలోచనలో మెగా కాంపౌండ్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

ADVERTISEMENT

ఒక్క ఆడియో విషయంలోనే కాదు, సినిమా విడుదల తేదీలోనూ ‘శాతకర్ణి’ సినిమా విడుదల తేదీని ప్రకటించిన తర్వాత మాత్రమే తమ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించే యోచనలో ‘ఖైదీ నంబర్ 150’ చిత్ర యూనిట్ ఉన్నట్లుగా సమాచారం. ఇదంతా “శాతకర్ణి” ట్రైలర్ సృష్టించిన ప్రభావంగానే ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అప్పటివరకు పైచేయి అనుకున్న చిరు మూవీ రీమేక్ కావడంతో, ఒక అడుగు క్రిందకి జారాల్సిన పరిస్థితి తలెత్తింది. మెగాస్టార్ వేసిన ఈ వెనుకడుగుతో ‘ఖైదీ నంబర్ 150’ ఆల్బమ్ కోసం వేచిచూసిన మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహంతో ఉన్నారు.

ADVERTISEMENT
Latest Stories