ఖైదీ నంబర్ 150 ఫ్రెష్ లుక్… ఫ్యాన్స్ కు పండగే..!

khaidi-no-150-chiranjeevi-fresh-lookవివి వినాయక్ దర్శకత్వంలో “ఖైదీ నంబర్ 150”గా ఎంట్రీ ఇవ్వబోతున్న మెగాస్టార్ చిరంజీవి ఫ్రెష్ లుక్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మిగిలి ఉన్న టాకీ పార్ట్ ను పూర్తి చేసేందుకు జరుపుతున్న షూటింగ్ స్పాట్ నుండి వచ్చిన చిరు లుక్స్ ఫ్యాన్స్ కు కావలసినంత కిక్ ను పంచుతున్నాయి. మాస్ లుక్ లో ‘మెగాస్టార్’ అదుర్స్ అంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

ముఖ్యంగా ఈ రెడ్ షర్టులో ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్ ధరించిన రెడ్ షర్టు లుక్ ను మైమరిపిస్తున్నారని ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నారు. వయసు పెరిగినా వన్నె తగ్గని మెగాస్టార్ ను ఈ ఫోటోలలోనే చూసి ఇలా మురిసిపోతుంటే… రేపు వెండితెరపై స్పందన ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. డిసెంబర్ 18వ తేదీన ఈ సినిమా ఆడియో విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories