‘సంక్రాంతి’ బరిలో ఉన్న సినిమా ప్రమోషన్ లో ‘మెగాస్టార్’

khaidi-no-150-chiranjeevi-promotionsసంక్రాంతి బరిలోకి దిగే సినిమాలు ఏంటో ఇప్పటికే ఖరారైపోయాయి. జనవరి 12వ తేదీతో మొదలు కాబోయే సినిమాల సందడి జనవరి 14వ తేదీ నాటికి నాలుగు సినిమాలు విడుదల కానున్నాయి. అందులో రెండు ‘ఖైదీ నంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి’ కాగా, మరొకటి శర్వానంద్ ‘శతమానం భవతి’ సినిమా మరియు దీపికా పదుకునే ‘XXX’ డబ్బింగ్ బొమ్మ. ఈ నాలుగింటిలో చిరు, బాలయ్యల చిత్రాల ప్రమోషన్స్ జోరుగా సాగుతుండగా, ‘శతమానం భవతి’ సినిమా ప్రమోషన్స్ ఆదివారం నుండి ప్రారంభం కాబోతోంది.

మిక్కీ జే మేయర్ స్వరపరచిన ఈ సినిమా ఆడియో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల కానుంది. సక్సెస్ ఫుల్ నిర్మాత ‘దిల్’ రాజు బ్యానర్ లో నిర్మించిన 25వ సినిమా కావడంతో, “శతమానం భవతి”కి మార్కెట్ వర్గాల్లో ప్రత్యేక క్రేజ్ ఉంది. దానికి తగిన విధంగానే ఏకంగా ‘ఖైదీ నంబర్ 150’నే ఆడియో విడుదల చేయనుండడంతో, సంక్రాంతి బరిలో నిలవనున్న ఈ సినిమాకు మెగా అభిమానుల అండ కూడా తధ్యమన్న టాక్ ట్రేడ్ వర్గాల్లో ఉంది.

ADVERTISEMENT

‘ఫీల్ గుడ్ లవ్ స్టోరీ’గా ఫ్యామిలీ వర్గీయులను టార్గెట్ చేసిన ఈ సినిమా టీజర్ నెటిజన్ల ఆదరణ చూరగొనడంలో సక్సెస్ సాధించింది. అందులోనూ గతేడాది ‘నాన్నకు ప్రేమతో, సోగ్గాడే చిన్నినాయనా, డిక్టేటర్’ వంటి భారీ సినిమాల మధ్య విడుదలై కూడా ‘ఎక్స్ ప్రెస్ రాజా’ ద్వారా శర్వానంద్ సక్సెస్ సొంతం చేసుకున్నాడు. మళ్ళీ అదే సంక్రాంతికి భారీ సినిమాల నడుమ విడుదల కానుండడంతో ‘గ్యారెంటీ సక్సెస్’తో శర్వానంద్ అడుగు పెట్టబోతున్నాడు.

ADVERTISEMENT
Latest Stories