‘ఖైదీ నెంబర్ 150’ సెట్స్ లో చిరంజీవి పంచాయితీ?

khaidi-no-150-movie-new-stillప్రస్తుతం సోషల్ మీడియాలో మెగాస్టార్ మెగా మూవీకి సంబంధించిన ఓ స్టిల్ హల్చల్ చేస్తోంది. నడుచుకుంటూ వస్తున్న మెగాస్టార్ ను చూసి చుట్టూ జనాలంతా లేచి నిలబడుతున్న తీరు చూసి… మొత్తానికి మెగాస్టార్ ఏదో పంచాయితీ చేయబోతున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ‘కత్తి’ సినిమాలో రైతులకు సంబంధించిన మ్యాటర్ ఉందన్న విషయం తెలిసిందే.

తాజాగా చిరు చిత్రంలో కూడా అలాంటి సన్నివేశాలలో భాగంగానే ఈ సీన్ చిత్రీకరిస్తున్నట్లుగా కనపడుతోంది. రైతులకు ఓ చిన్న సైజు క్లాస్ పీకే సన్నివేశాలను చిత్రీకరించినట్లుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఫోటో స్పష్టంగా లేకపోయినా… సన్నివేశంలో మంచి మ్యాటర్ ఉందన్న విషయమైతే స్పష్టమవుతోంది. మెగాస్టార్ సినిమాకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా ఫ్యాన్స్ కు పండగే కదా?! అందుకే ఈ చిన్న ఫోటో పెద్ద సందడి చేస్తోంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories