‘ఖైదీ’ గురించి కావాల్సింది ఇచ్చిన ‘చెర్రీ’

khaidi-no-150-ram-charan-on-krish-gpsసెన్సార్ పూర్తయిన రిలీజ్ డేట్ ప్రకటించకుండా అభిమానులతో దోబూచులాడుతున్న ‘ఖైదీ నంబర్ 150’ చిత్ర నిర్మాత రామ్ చరణ్, ఎట్టకేలకు ఆ గుట్టు విప్పారు. ముందుగా అంచనాలు వేసిన ప్రకారం కాకుండా, ఈ ఏడాది మొదటి పెద్ద సినిమాగా మెగాస్టార్ చిత్రమే విడుదల అవుతోంది. జనవరి 11వ తేదీన భారీ స్థాయిలో ‘ఖైదీ నంబర్ 150’ చిత్రాన్ని విడుదల చేయనున్నామని రామ్ చరణ్ స్వయంగా ప్రకటించడంతో అభిమానుల ఆనందం రెండింతలయ్యింది.

అయితే ‘ప్రీ రిలీజ్ ఫంక్షన్’ మాదిరి ఈ ‘విడుదల తేదీలో’ కూడా ఎలాంటి ట్విస్ట్ లు ఉండవు కదా… అంటూ కాస్త సందేహం వ్యక్తం చేయడం అభిమానుల వంతవుతోంది. ఇటీవలే ప్రీ రిలీజ్ వేడుక గురించి ఓ వీడియోను రూపొందిస్తూ చెర్రీ స్వయంగా ప్రకటించగా, అది కాస్త వెన్యూతో సహా మరో రెండు రోజులకు వాయిదా పడిన వైనం అందరికీ తెలిసిందే. దీంతో కనీసం విడుదల విషయంలోనైనా చెప్పిన మాట తప్పకుండా ఉంటారని అభిమానులు ఆశిస్తుండడం విశేషం.

ADVERTISEMENT

గత కొన్ని రోజులుగా ఇదే విషయం కోసం ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో వేచిచూస్తుండగా, ఫేస్ బుక్ లో కాసేపు అభిమానులతో ముచ్చటించిన సందర్భంగా, ఈ విషయాన్ని బయటపెట్టాడు రామ్ చరణ్. దీంతో ఫ్యాన్స్ కు ఫెస్టివల్ టైం ఆసన్నమైనట్లుగా కనపడుతోంది. బరిలో ఉన్న నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమా కంటే ఒక రోజు ముందుగానే ప్రేక్షకుల ముందుకు వస్తుండడంతో మెగా ఫ్యాన్స్ ఉత్సాహం మరింతగా రెట్టింపయ్యింది. ఈ సందర్భంగా బాలయ్యకు, క్రిష్ కు కూడా ‘ఆల్ ది బెస్ట్’ చెప్పారు రామ్ చరణ్.

ADVERTISEMENT
Latest Stories