‘కోటి’ క్లబ్ లో చేరిన ‘ఖైదీ నంబర్ 150’ పాటలు!

khaidi-no-150-songs-reached-millions-clubమెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీపై సినీ విమర్శకుల స్పందన ఎలా ఉన్నప్పటికీ, మెగా అభిమానుల నుండి మాత్రం ఊహించని రీతిలో స్పందన వెలువడుతోంది. ఇప్పటికే యూ ట్యూబ్ లో పలు రికార్డులను బద్దలు కొట్టిన మెగా ఫ్యాన్స్ దాటికి, ఆ రికార్డులు మరింత పదిలమయ్యేలా కనపడుతున్నాయి. ఇప్పటివరకు విడుదలైన మూడు ‘ఖైదీ నంబర్ 150’ పాటలు కలిపి 1 కోటి 20 లక్షల క్లిక్స్ ను అందుకోవడం విశేషం.

ఇందులో తొలిపాట ‘అమ్మడు లెట్స్ డు కుమ్ముడు’ ఏకంగా 71 లక్షల క్లిక్స్ అందుకుని కోటి క్లిక్స్ వైపుకు పరుగులు పెడుతోంది. రెండవ పాట ‘సుందరి’ తాజా సమాచారం ప్రకారం 36 లక్షల క్లిక్స్ అందుకుని 5 మిలియన్ క్లిక్స్ దిశగా అడుగులు వేస్తోంది. ఇక, ఇప్పటివరకు విడుదలైన పాటల్లో అన్ని వర్గాల నుండి ఆదరణ పొందిన దేవి మెలోడీ ‘యు అండ్ మీ’ పాట అతి తక్కువ సమయంలోనే 1 మిలియన్ క్లిక్స్ ను అందుకుని, సరికొత్త చరిత్ర సృష్టించింది.

ADVERTISEMENT

ఇలా విడుదలవుతున్న ఒక్కో పాట యూ ట్యూబ్ లో సరికొత్త రికార్డులకు వేదిక అవుతుంటే, పండగ చేసుకోవడం మెగా ఫ్యాన్స్ వంతవుతోంది. అలాగే ఈ స్పందనను చూసి చిత్ర యూనిట్ మిక్కిలి సంతోషం వ్యక్తం చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. జనవరి 4వ తేదీ వరకు కొనసాగుతున్న ఈ పాటల విడుదలలు, ఆ రోజు రిలీజ్ కాబోయే ధియేటిరికల్ ట్రైలర్ తో అంచనాలు తారాస్థాయికి వెళ్ళే విధంగా చిత్ర యూనిట్ ప్లానింగ్ చేస్తోంది.

ADVERTISEMENT
Latest Stories