‘ఖైదీ నంబర్ 150’ ఆడియో అప్ డేట్… నిరాశలో ఫ్యాన్స్..!

khaidi-no-150-update-audio-release-postponedఇప్పటికే విడుదల కావాల్సి ఉన్న మెగాస్టార్ చిరంజీవి “ఖైదీ నంబర్ 150” సినిమా ఆడియో, అంతకంతకూ వెనక్కి వెళ్తోంది. ఇప్పటివరకు రెండు పాటలు విడుదల చేసిన చిత్ర నిర్మాణ సంస్థ, తాజాగా ఆడియోపై అప్ డేట్ ఇచ్చింది. ‘యూ అండ్ మీ’ అనే మెలోడీ గీతాన్ని డిసెంబర్ 28వ తేదీన బుధవారం నాడు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం ఇస్తూ… ఈ పాటలో మెగాస్టార్ స్టిల్ ను విడుదల చేసారు.

ఎప్పటిలాగానే ‘మెగాస్టార్’ లుక్ అదిరిపోయే రేంజ్ లోనే ఉండడంతో మెగా ఫ్యాన్స్ ను ఈ పోస్టర్ కావల్సినంత ‘కిక్’ను పంచుతోంది. అయితే ‘ఖైదీ నంబర్ 150’ ఫుల్ ఆడియోను విడుదల చేస్తారని ఎదురుచూస్తున్న తరుణంలో… మళ్ళీ సింగిల్ సాంగ్ నే విడుదల చేస్తుండడంతో మెగా అభిమానులు నిట్టూర్పును ప్రదర్శిస్తున్నారు. ఇలా వారానికొక పాట విడుదల చేస్తుంటే… మిగిలి ఉన్న మరో రెండు, మూడు పాటలు విడుదల చేయడానికి, ఇంకో రెండు, మూడు వారాలైనా వేచిచూడాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ADVERTISEMENT

ఇదంతా ఒకెత్తు అయితే, విడుదలవుతున్న ప్రతి పాట చాలా సాదాసీదాగా ఉండి, మెగాస్టార్ రేంజ్ కు తగిన విధంగా లేకపోవడంతో… మెగా ఫ్యాన్స్ లో ఉత్సాహానికి పరీక్ష పెడుతున్నట్లువుతోంది. అయితే రాబోయే మూడవ పాట ‘మెలోడీ’గా చెప్పడంతో, ఈ పాటపై భారీ అంచనాలనే పెట్టుకున్నారు. ‘ఐటెం’ సాంగ్స్ ను ఎంత అద్భుతంగా అయితే కంపోజ్ చేయగలడో, మెలోడీలను అంతకంటే అద్భుతంగా స్వరపరచగల సమర్ధుడు దేవిశ్రీప్రసాద్ కావడంతో… ‘యూ అండ్ మీ’తో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories