చిరుకు కలిసిరాలేదు… మరి పవన్ కళ్యాణ్ కు..?

khushbu-in-pawan-kalyan-trivikram-movieతమిళ ప్రేక్షకులు ఆరాధ్యంలా భావించి మరీ గుడి కట్టించిన ఖుష్భూ, తెలుగు తెరపై చాలా అరుదుగా కనిపించింది. తమిళనాట సూపర్ సక్సెస్ అయినప్పటికీ, టాలీవుడ్ లో అంతంత మాత్రపు అవకాశాలే దక్కడానికి ప్రధాన కారణం… ఖుష్బూ నటించిన తెలుగు సినిమాలు పరాజయం పాలు కావడమే. విక్టరీ వెంకటేష్ తో నటించిన సినిమా మినహా ఇప్పటివరకు ఖుష్బూ చేసిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపకపోవడంతో… ఆమెను పక్కన పెట్టేసారు.

అయితే చాలా కాలం తర్వాత తమిళ దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన “స్టాలిన్” సినిమాతో మెగాస్టార్ చిరంజీవి సోదరీమణిగా ఖుష్బూ నటించి మెప్పించారు. అయితే ఈ సినిమా కూడా ‘సో సో’గానే నిలిచింది. దీంతో మరో దర్శక నిర్మాత ఖుష్బూ వైపుకు చూసింది లేదు. అలాగే మరో తెలుగు సినిమాను కూడా ఖుష్బూ అంగీకరించలేదు. అయితే మళ్ళీ దాదాపుగా ఒక దశాబ్దం తర్వాత మళ్ళీ మెగా హీరో సినిమాతోనే తెలుగు తెరపై మెరవనుంది.

ADVERTISEMENT

ఇటీవల దీనికి సంబంధించిన వార్తలు చక్కర్లు కొట్టినప్పటికీ, తాజాగా ఖుష్బూ దీనికి రాజముద్ర వేసింది. పవన్ – త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నట్లుగా ఖుష్బూ ఖరారు చేసింది. మరి అన్నయ్యకు ప్రతికూల ఫలితాలను అందించిన ఖుష్బూ, తమ్ముడుకు ఎలాంటి జ్ఞాపకాలను మిగిలిస్తుందో చూడాలి. అయితే త్రివిక్రమ్ సినిమా కావడంతో రిజల్ట్ పై అనుమానం లేదు అంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్.

ADVERTISEMENT
Latest Stories