తెలుగుదేశం వ్యతిరేక మీడియాకు ఏదైనా వార్తే

Kinjarapu Atchannaiduతెలుగుదేశం వ్యతిరేక మీడియాకు ఏదైనా వార్తే అన్నట్టు ఉంది వ్యవహారం. మొన్న ఆ మధ్య తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కింజరాపు అచ్చెన్నాయుడుని నియమిస్తారని వార్తలు వచ్చాయి. వెనువెంటనే సదరు మీడియా అదేంటి ఈఎస్ఐ స్కామ్ నిందితుడికి అధ్యక్షా పదవా అంటూ వార్తలు రాశాయి.

మూడు డజన్ల కేసులు ఉన్నవారు ముఖ్యమంత్రి అవొచ్చా అంటూ టీడీపీ శ్రేణులు తిప్పే కొట్టే ప్రయత్నం చేశాయి. ఆ తరువాత టీడీపీ పార్లమెంట్ ఇంచార్జిలను ప్రకటించింది. అప్పుడు అధ్యక్ష పదవి ప్రకటించకపోవడంతో అచ్చెన్నాయుడు కుటుంబన్నీ చంద్రబాబు వాడుకుని వదిలేశారు. ఆ కుటుంబంలో చీలిక తెచ్చారు అంటూ ఏవేవో వార్తలు వడ్డించేశాయి.

ADVERTISEMENT

తాజాగా తెలుగుదేశం పార్టీ 24 మందితో పొలిట్‌బ్యూరో… అలాగే 27 మందితో పార్టీ సెంట్రల్ కమిటిని ఏర్పాటు చేసింది. ఆ సమయంలోనే ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు నియామాకన్నీ ఖరారు చేశారు చంద్రబాబు. దీనితో మళ్ళీ ఈఎస్ ఐ స్కామ్ అంటూ పాత పాటే మొదలుపెట్టింది సదరు మీడియా.

మరోవైపు మొన్న పార్టీ పొలిట్‌బ్యూరోకు గల్లా అరుణకుమారి రాజీనామా చేస్తే… ఆవిడ కుమారుడు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పార్టీ మారతారు అంటూ ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు ఆమె స్థానంలో గల్లా జయదేవ్ ని పొలిట్‌బ్యూరోలోకి తీసుకున్నారు. అదే సమయంలో గల్లా అరుణకుమారి కేంద్ర పార్టీ ఉపాధ్యక్షురాలిగా ప్రకటించారు. గత కొంత కాలంగా పార్టీ మారతారని ప్రచారం జరుగుతున్న డీకే సత్యప్రభను కూడా కేంద్ర పార్టీ ఉపాధ్యక్షురాలిగా ప్రకటించారు.

ADVERTISEMENT
Latest Stories