Kiran Abbavaram Meterమాస్ సినిమాలుకున్నంత కమర్షియల్ స్టామినా మిగిలినవాటికి ఉండదన్నది వాస్తవం. అందుకే కుర్ర హీరోలు ఎప్పుడెప్పుడు ఈ లీగ్ లోకి ప్రవేశిద్దామాని ఎదురుచూస్తూ ఉంటారు. కథల పట్ల జడ్జ్ మెంట్, సరైన నిర్ణయాలు తీసుకోలేనప్పుడు ఇవి బూమరాంగ్ లాగా రివర్స్ లో వచ్చి తలకు తగులుతాయి. నితిన్, రామ్ లాంటోళ్ళు కెరీర్ మొదట్లో ఇలాంటి దెబ్బలు తిన్నవాళ్ళే. కానీ బలమైన బ్యాక్ గ్రౌండ్ ఉండటం వల్ల కిందపడినా తిరిగి లేచి సక్సెస్ బాట పట్టారు. ఈ అవకాశం అందరికీ ఉండదు. అందుకే మసాలా కథల జోలికి వెళ్ళేటప్పుడు అప్ కమింగ్ యువకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మార్కెట్ తగ్గిపోయి కెరీర్ రిస్క్ లో పడే ప్రమాదముంది.

కిరణ్ అబ్బవరంకు యూత్ లో మొన్నటిదాకా మంచి సాఫ్ట్ కార్నర్ ఉండేది. ఏదో కష్టపడి పైకొస్తున్నాడనే సానుభూతి సాధారణ ప్రేక్షకుల్లోనూ ఉంది. అయితే మాస్ ని మెప్పించాలనే అతి తాపత్రయం తనకు చేటు చేస్తున్న మాట నిజం. మీటర్ మీద ఆడియన్స్ లో ముందు నుంచి పెద్దగా ఆసక్తి లేదు. ట్రైలర్ చూశాక ఇదేదో రొటీన్ తతంగంలా ఉందని లైట్ తీసుకున్నారు. అందుకే ఓపెనింగ్స్ వీక్ గా మొదలయ్యాయి. రాష్ట్ర హోమ్ మినిస్టర్ కి ఒక చిన్న ఎస్ఐకి మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఈ మీటర్. మధ్యలో బోనస్ గా కాస్త ఎమోషనల్ గా ఫీలయ్యేలా చేసేందుకు ఫాదర్ సెంటిమెంట్. ఇంతకు మించి పెద్దగా చెప్పుకోవడానికి ఇందులో కథేమీ లేదు.

Also Read – ఎవరిని నిందించాలి..?

దర్శకుడు రమేష్ కడూరి తను డైరెక్ట్ చేస్తోంది కళ్యాణ్ రామ్ అనుకున్నాడో లేక జూనియర్ ఎన్టీఆర్ తో తీస్తున్నానని ఫీలయ్యాడో తెలియదు కానీ కిరణ్ తో ఇలాంటి సబ్జెక్టుని ఎంచుకోవడమే పెద్ద తప్పు. ఏ ఫ్రేమ్ లోనూ కొత్తదనం ఉండదు. ప్రతిదీ గతంలో చూసిన ఎన్నో సినిమాల ఫీల్ ఇస్తుంది. సిల్లీగా అనిపించే లవ్ ట్రాక్, విసుగనిపించే పాటలు, హోమ్ మినిస్టర్ అంటే ఏదో బడ్డీ కొట్లో కిళ్ళీలు కట్టేవాడిగా క్యారెక్టర్ ని డిజైన్ చేసిన తీరు ఒకటా రెండా ఏ కోశానా ఓ మాదిరి సినిమా తీశామనే ప్రయత్నం చేయలేదు. కిరణ్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఈలలు కేకలతో థియేటర్లో గోల చేస్తారనే భ్రమలో రాసుకున్న సన్నివేశాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

ఆడియన్స్ ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. టేకన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోకూడదు. ఆలా చేసినందుకే మహామహా దర్శకులకే డిజాస్టర్లు తప్పలేదు. అలాంటిది డెబ్యూ ఆఫర్ వచ్చినప్పుడు కొత్త దర్శకుడు క్రియేటివిటీని బయటకి తీయాలి తప్పించి పటాస్, పోకిరి, గబ్బర్ సింగ్ లు చూసి సీన్లు రాసుకోవడం కాదు. మీటర్ చూసి బయటికి వచ్చాక అదే ఫీలింగ్ కలుగుతుంది. పోనీ కిరణ్ అబ్బవరం ఏమైనా ఓ పాతిక సినిమాల అనుభవమున్న నటుడైతే రొటీన్ అయితే అయ్యిందని ఫ్యాన్స్ చూసేవాళ్ళు. కానీ ఎదుగుతున్న స్టేజిలో ఇలాంటి రోత స్క్రిప్ట్ మళ్ళీ మళ్ళీ ఎంచుకుంటే కిరణ్ భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.

Also Read – కవిత అనారోగ్యం ‘ఉపశమనాన్ని’ ఇస్తుందా.?