ఈ మధ్యనే వైఎస్సాఆర్ కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిన వంగవీటి రాధ తన రాజకీయ భవితవ్యం గురించి ఇంకా ఏమీ తేల్చలేదు. టీడీపీలో చేరతారని మొదట వినిపించినా అడుగు ముందుకు పడలేదు. నిన్న ఆయన చంద్రబాబుతో భేటీ అవ్వడంతో పార్టీలో చేరడానికి సంబంధించిన తేదీని ఖరారు చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఆయన ఉన్నఫళంగా కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని భేటీ అయ్యారు.
ఈ భేటీలో రాధాకృష్ణ వెంట ఆయనకు సన్నిహితులైన కాపు నేతలు కూడా పాల్గొన్నారు. పార్టీని వీడి ఇప్పుడు అదే పార్టీ నేతతో భేటీ అవ్వడం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఆయన వైఎస్సాఆర్ కాంగ్రెస్ లోకి ఏమైనా తిరిగి వెళ్లే అవకాశం ఉందా అనే చర్చ జరుగుతుంది. ఒకవేళ అటువంటిది ఏమీ లేకపోతే ఇప్పుడు టీడీపీ కూడా వంగవీటి రాధాను అనుమానించే పరిస్థితి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ వారు కొడాలి నానిని బద్ద శత్రువుగా చూస్తారు. ఈ క్రమంలో వారి భేటీ ఆ పార్టీకి ఎంత మాత్రం రుచించదు.
నాని, రాధా చాలా క్లోజ్ మిత్రులు. రాధా జగన్ కు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయనను ఆపడానికి నాని గట్టిగా ప్రయత్నించారు. అయితే ఆయన మాట రాధా వినలేదు. రాష్ట్రం మొత్తం పర్యటించి జగన్ ను ఓడించడమే తన లక్ష్యమని ఆయన ప్రకటించేశారు. రాజకీయాలలోకి వచ్చిన నాటి నుండీ వంగవీటి రాధా తొందరపాటు రాజకీయాలే. ఇటువంటి తొందరపాటు చర్యల వల్లే ఆయన రాజకీయ జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది. ఈ క్రమంలో



