కాంగ్రెస్ లో అజారుద్దీన్ కి మంత్రి పదవి రావడంతో కోటమరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు అనూహ్యంగా తెలంగాణ రాజకీయాలలో చర్చకొచ్చింది.
తనకు మంత్రి పదవి దక్కలేదు అనే అక్కసుతో సొంత పార్టీ నేతలపైనే విమర్శలు ఎక్కుపెట్టి కాంగ్రెస్ లో ఉండే అంతర్గత ఆధిపత్య పోరులను బహిర్గతం చేస్తూ తెలంగాణలో హాట్ టాపిక్ అయ్యారు రాజగోపాల్.
అయితే తన అలక, తన అసంతృత్తి పార్టీ అధిష్టానాన్ని కదిలించలేకపోయావడంతో ఇక పార్టీలో కొన్నాళ్లుగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లారు. రాజగోపాల్ సైలెన్స్ వెనుక పార్టీ జెండా మార్చేంత వైలెన్స్ దాగుందంటూ కొన్నాళ్లుగా తెలంగాణ రాజకీయాలలో ప్రచారం జరుగుతుంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు అజారుద్దీన్ కి వరంలా మారయా.? లేక ఆయన పార్టీ పట్ల, పార్టీ అధిష్టానం పట్ల చూపించిన విధేయతే ఆయనకు మంత్రి పదవిని అందించిందా.? అంటే రెండిటికి అవుననే సమాధానం చెప్పాలి.
కోమటిరెడ్డి ఆవేశం ఆయనకు ఎప్పుడు అనర్ధాలే తెచ్చిపెడుతుంది. గతంలో కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేవంత్ ను ప్రకటిస్తే అందుకు నేను అంగీకరించేది లేదు అంటూ పార్టీ మారిన కోమటరెడ్డి చివరికి తిరిగి సొంత గూటికే చేరారు.
అయితే నాటి కోమటరెడ్డి ఆవేశం నేడు రేవంత్ రెడ్డి కి అవకాశంగా మారింది. నాడు రేవంత్ నాయకత్వం మీద రాజగోపాల్ చూపిన వ్యతిరేకత నేడు ఆయనను రేవంత్ క్యాబినెట్ లో మంత్రి పదవికి దూరం చేసింది.
దీనిబట్టి చూస్తే రాజకీయాలలో ఆవేశంతో ఎదగాలని భావించడం, బెదిరించి పదవులు పొందాలని అనుకోవడం ఎప్పుడు వైతిరేక ఫలితాలనే ఇస్తుంది అని రాజగోపాల్ రెడ్డి ఉదాంతం తో మరోసారి రుజువయ్యింది అనుకోవచ్చు.







