కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డికి మొదటి తలపోటు!

komatireddy venkat reddy against Revanth Reddy Padayatraకాంగ్రెస్ లో చేరిన టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి మొదటి తలపోటు మొదలయ్యింది. సీనియర్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన పాదయాత్రను అడ్డుకునేలా అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారు. పాదయాత్రలకు కాంగ్రెస్ లో అనుమతి ఇవ్వరని కోమటిరెడ్డి మీడియా ముఖంగానే చెపుతున్నారు.

గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రకు గులాం నబీ అజాద్ ఒప్పుకోలేదని ఆయన అన్నారు. తాను, భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేస్తానన్నా అనుమతి ఇవ్వలేదని చెప్పారు.ఇప్పుడు కూడా ఒప్పుకుంటారని అనుకోవడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఒక వేళా పర్మిషన్ ఇచ్చిన అందరూ కలిసి బస్సు యాత్ర గానీ లేదంటే, అందరూ కలిసి పాదయాత్ర చేస్తారేమో చూడాలి అని అనడం విశేషం.

ADVERTISEMENT

దీనిబట్టి తన మనసులో మాట కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పకనే చెప్పినట్టు తెలుస్తుంది. తన పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదు కాబట్టి రేవంత్ రెడ్డి పాదయాత్రకు కూడా అనుమతి ఇవ్వరాదు అని హై కమాండ్ కు ఆయన మీడియా ద్వారా ఒక మెసేజ్ పంపినట్టు ఉన్నారు.

ADVERTISEMENT
Latest Stories