“భలే భలే మగాడివోయ్” వంటి సూపర్ హిట్ తర్వాత 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలో నాని నటిస్తున్న చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. ‘అందాల రాక్షసి’ ఫేం హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. గన్ తో బెదిరిస్తున్న సందర్భంలో నాని భయపడుతున్నట్లున్న పోస్టర్ వీక్షకులను ఆకట్టుకుంటోంది.
ముఖ్యంగా ఈ పోస్టర్ లో మేజర్ హైలైట్ గా నిలిచింది ఈ సినిమా టైటిల్. గతంలో “జై బాలయ్య” టైటిల్ వినపడడంతో ఈ సినిమా టైటిల్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే సస్పెన్స్ కు తెరదించుతూ విడుదల చేసిన “కృష్ణగాడి వీరప్రేమగాధ” టైటిల్ కూడా అదిరింది అంటున్నారు సినీ ప్రేమికులు. పాత సినిమాల టైటిల్స్ మాదిరి వినపడుతున్నా… కాస్త కొత్తగానే అగుపిస్తోంది మరి!
ADVERTISEMENT
ADVERTISEMENT





