టీడీపీ పై ఉన్న వ్యతిరేకత, బాబు పై ఉన్న అక్కసు బిఆర్ఎస్, వైసీపీ లను దగ్గర చేసాయి, జగన్, కేసీఆర్ లను ఒకే తాటి మీదకు తెచ్చాయి. బాబు కి రిటర్న్ గిఫ్ట్ అంటూ మొదలైన జగన్ కేసీఆర్ ల అంతర్గత రాజకీయ బంధం చివరికి టీడీపీ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ తో బట్టబయలయ్యింది.
తెలంగాణ లో బిఆర్ఎస్ ఓటమికి కొనసాగింపుగా ఏపీలో వైసీపీ పతనమయ్యింది. దీనితో అక్కడ కేసీఆర్ ఫామ్ హౌస్ రాజకీయాలకు పరిమితమయితే ఇక్కడ జగన్ పాలస్ రాజకీయాలతో బిజీగా ఉన్నారు.
ఇక ఈ రెండు పార్టీల మధ్య బంధాన్ని కొనసాగించేందుకు కేసీఆర్ రాజకీయ వారసుడు, బిఆర్ఎస్ భవిష్యత్ నాయకుడు కేటీఆర్ కూడా మంచి ఆసక్తిని కనపరుస్తూ అటు జగన్ తో ఇటు వైసీపీ తో మంచి స్నేహ సంబంధాలను కొనసాగిస్తున్నారు.
అందుకు కోసం జగన్ సొంత చెల్లి షర్మిల ఫోన్ టాపింగ్ కు కూడా సిద్దపడ్డారనే ఆరోపణలు కేటీఆర్ ను వెంటాడుతున్నాయి. అలాగే అటు షర్మిల తో జగన్ ఎదుర్కుంటున్న ఇంటి పోరు ఇటు కవిత తో కేటీఆర్ భరించాల్సి వసుంది. ఇలా ఈ ఇద్దరు బడా నాయకులు ఇప్పటి వరకు ఒకే దారిలో నడుస్తూ తమ పార్టీల రాజకీయ లబ్ది కోసం కలిసి మెలిసి రాజకీయం నడిపిస్తున్నారు.
ఇక ఇప్పుడు ఓట్ చోరీ అంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బీజేపీ పై చేసున్న రాజకీయ యుద్దానికి కేటీఆర్ తన వంతు మద్దతు ప్రకటించారు, రాహుల్ ఆరోపణలకు తన విమర్శలు జోడించి అటు కేంద్ర ప్రభుత్వం పై, ఇటు ఎన్నికల సంఘం పై తన సోషల్ మీడియా వేదికగా విమర్శలు ఎక్కుపెట్టారు.
ప్రజాస్వామ్యంలో ఈసీ కీలక పాత్ర పోషిస్తుందని, అటువంటి భారత ఎన్నికల సంఘం ప్రక్షాళనకు సమయం ఆసన్నమయ్యిందంటూ కేటీఆర్ తన X లో పోస్ట్ చేసారు. అలాగే ఈసీ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమయ్యిందని, ఈసీ సంఘం అధికారులు పెట్టిన ప్రెస్ మీట్లో సమాధానాలకన్నా సందేహాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఆరోపించారు కేటీఆర్.
అయితే ఎవరు ఊహించని విధంగా కేటీఆర్ కాంగ్రెస్ నేత రాహుల్ వ్యాఖ్యలకు వంత పాడుతూ బీజేపీ కి వ్యతిరేకంగా గళం విప్పారు. కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం రాహుల్ ని బాబు తో ముడిపెట్టి రాజకీయ విమర్శలు చేస్తూ బీజేపీ తో అంటకాగుతున్నారు. ఒక పక్క టీడీపీ, బీజేపీ కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ ఈ విషయంలో వైసీపీ టీడీపీ కి వ్యతిరేఖంగా వెళ్లేందుకు సాహసించడం లేదు.
టీడీపీ ప్రభుత్వం నిర్ణయించిన రాష్ట్ర రాజధాని అమరావతిని సమాధి చేయడానికి కూడా క్షణం ఆలోచించని జగన్ టీడీపీ పొత్తులో ఉన్న బీజేపీ తో తెగతెంపులు చేసుకోవడానికి మాతరం గత కొన్నేళ్ల నుంచి ఆలోచిస్తూనే ఉన్నారు. ఒక పక్క టీడీపీ తో రాజకీయ యుద్ధం చేస్తూనే మరోపక్క టీడీపీ కూటమిలో భాగమైన బీజేపీ తో తత్సబంధాలు కొనసాగిస్తుంది.
2024 ఎన్నికల సమయంలో కూడా జగన్, బీజేపీ ని టార్గెట్ చేయడానికి కూడా ముందుకు రాలేదు, కానీ 2023 ఎన్నికలలో బిఆర్ఎస్ ఏకంగా బీజేపీ పై ప్రత్యక్ష రాజకీయ యుద్దానికి సిద్దమయ్యిది. ఇక బీజేపీ పార్లమెంట్ లో ప్రతిపాదించిన ప్రతి బిల్లుకు వైసీపీ మద్దతు తెలుపుతూనే వస్తుంది, అలాగే బీజేపీ నామినేట్ చేస్తున్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవుల అభ్యర్థులకు వైసీపీ ఓటింగ్ చేస్తూనే ఉంటుంది.
నాడు రాష్ట్రపతిగా ద్రౌపతి ముర్ము విషయంలోనూ నేడు ఉపరాష్ట్రపతిగా సీపీ రాధా కృష్ణన్ విషయంలోనూ బీజేపీ కి బేషరతు మద్దతు పలికింది వైసీపీ. ఈ అంశాన్నిటిని పరిగణలోకి తీసుకుంటే బీజేపీ విషయంలో కేటీఆర్ – జగన్ దారులు వేరయ్యాయి అని స్పష్టమవుతుంది.




