ktr-jagan

విజయం బాధ్యతను గుర్తు చేయలేకపోయినా ఓటమి భయాన్ని పుట్టింస్తుందని రుజువు చేస్తున్నారు వైసీపీ నాయకులు. 2019 ఎన్నికలలో 151 సీట్లతో అనూహ్య విజయాన్ని అందుకున్న వైసీపీ గెలిపించారు అనే కృతజ్ఞత మరిచి గెలిచాము అనే గర్వంలోకి వెళ్లిపోయారు.

అటు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ నేతల పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే స్థితిలో ఉంది. రాష్ట్రం ఏర్పడిన తరువాత వరుసగా రెండవ సారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలాన్ని బిఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు అక్కడి ప్రజలు. అయితే వచ్చిన అవకాశాన్ని ఇచ్చిన ప్రజల కోసం కాకుండా నమ్ముకున్న స్నేహితుల గెలుపు కోసం వాడుకున్నారు బిఆర్ఎస్ నాయకులు.

Also Read – అన్నకు సాకులే అస్త్రాలు…చెల్లికి ప్రశ్నలే ఆయుధాలు..!

వరుసగా రెండవ సారి కూడా తమకే అవకాశం కల్పించారు ఇక రాష్ట్రంలో ప్రతిపక్షాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన పని లేదు అంటూ అధికారంతో అహంకారాన్ని తలకెక్కించున్నారు బిఆర్ఎస్ నాయకులు. ఆ పదేళ్ల అధికార అహంకారాన్ని ఒకే ఒక్కరోజులో పాతాళానికి తొక్కారు ఓటర్లు.

గెలుపు బలుపుతో ఒకరు, గెలుపు అహంతో మరొకరు ఓట్లేసిన ప్రజలను దూరం పెట్టారు, పోరాటాలు చేస్తున్న ప్రతిపక్షాలను చిన్న చూపు చూసారు. ఇప్పుడు దాని ఫలితం అనుభవిసున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన వారికి మరో ఛాన్స్ లేకుండా, మరో ఛాన్స్ ఇచ్చిన వారికి ఇంకో అవకాశం ఇవ్వకుండా చేసుకున్నారు.

Also Read – జగన్ ఉన్న చోట ప్రజాస్వామ్యానికి చోటు ఉంటుందా?

మా హయాంలో హైద్రాబాద్ లో అభివృద్ధిని పరుగులు పెట్టించాం అయినా ఎందుకు ఓడిపోయామో తెలియడం లేదు అంటూ బిఆర్ఎస్…., మా హయాంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాల బటన్లు నొక్కం అయినా ప్రజలు ఎందుకు తిరస్కరించారో అర్ధం కావడం లేదు అంటూ వైసీపీ…ఆత్మ పరిశీలను చేసుకోకుండా ప్రజలను నిందిస్తున్నారు. దీనిబట్టి ప్రజలు సంక్షేమం..అభివృద్ధి రెండు కోరుకుంటున్నారు అనేది స్పష్టమయింది.

2014 ఎన్నికలలో ఏపీ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ విభజిత ఆంధ్రప్రదేశ్ ను ఒక గాడిలో పెట్టడానికి ఐదేళ్లల్లో ఎంత చేసిందో ఇప్పుడు తెలుసుకుంటున్నారు ఏపీ ప్రజలు. ఐదేళ్లలో అమరావతిలో ఎన్ని ప్రభుత్వ భవనాలు నిర్మించారో, ఎంత ఉపాధి కల్పించారో, ఎన్ని రోడ్డులేసారో ఇప్పుడు దేశం మొత్తం చర్చించుకుంటుంది.

Also Read – నోరు పెద్దగా చేస్తే ఎవరు భయపడరు..!

అంత చేసినా 2019 లో ఏపీ ప్రజలు టీడీపీ ని కాదని వైసీపీ వైపు చూసి రాష్ట్రాన్ని మరోపదేళ్లు వెనక్కి తెచ్చుకున్నారు. అయితే జగన్ రాష్ట్రానికి చేసిన విధ్వంసాన్ని అర్ధం చేసుకున్న ప్రజలు 2024 లో వైసీపీ సమాధి కట్టారు. ఇప్పుడు వైసీపీ పార్టీ ఓటమి మీద విశ్లేషణలు చేస్తున్న కేటీఆర్ టీడీపీ గెలవడానికి వైసీపీ ఓడడానికి పవన్, జనసేనే కారణమంటూ తేల్చారు.

అయితే కేటీఆర్ విశ్లేషణ నూటికి నూరు శాతం నిజమే అయినప్పటికీ 2019 ఎన్నికలలో టీడీపీ ఓటమికి వైసీపీ గెలుపుకి కూడా జనసేన ఒంటరి పోటీనే కారణమవుతుంది అనే చిన్న లాజిక్ ను కేటీఆర్ విస్మరించారు. వైసీపీ గెలిచినప్పుడు టీడీపీ అవినీతికి పాల్పడింది, ప్రజలు బాబుని తిరస్కరించారు అంటూ విశ్లేషణలు చేసిన బిఆర్ఎస్ ఇప్పుడు జగన్ ఓటమికి మాత్రం జనసేన పొత్తే కారణం అనడం ఎంత వరకు సమంజసం.

అప్పటి ఓటమికి ఇప్పుడు టీడీపీ గెలుపుకి రెంటికి జనసేన సాక్షిగానే మిగిలింది. ఈ విషయాన్ని అర్ధం చేసుకున్నారు కాబట్టే పవన్ ఈ సారి వైసీపీ వ్యతిరేక ఓటు చిలనివ్వను అంటూ మూడు పార్టీల పొత్తును సృష్టించారు. విజయం సాధించారు. అయితే బిఆర్ఎస్ , వైసీపీ రెండు పార్టీలు ఒక్కసారిగా ఇంటి బాట పట్టడంతో ఇక ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ ఇలా సంతృప్తి పడుతున్నారు.

అలాగే వైసీపీ, బిఆర్ఎస్ రెండు పార్టీలకు ప్రజలు అందించిన తిరస్కరణకు తోడు ఆ పార్టీ నేతలను కేసులు నీడలా వెంటాడుతున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన సిబిఐ, ఈడీ కేసీఆర్ కుమార్తె కవితను లిక్కర్ స్కాములో అరెస్టు చేసారు. ఇక రాష్ట్ర సంస్థలు ఫోన్ టాపింగ్ ఆరోపణలతో కేటీఆర్ పైన, అక్రమ విద్యుత్ కొనుగోళ్ల ఆరోపణలతో కేసీఆర్ పై కేసులు నమోదు చేసింది.

ఇక వైసీపీ నేతల కేసుల చిట్టా పొద్దు ఆది అంతం లేకుండా కొనసాగుతూనే ఉన్నాయి. పార్టీ అధినేతే పదేళ్ల నుండి బెయిలు మీద తిరుగుతున్నారు. ఇక ఇప్పుడు పార్టీలోని ముఖ్యనేతలందరు ఒక్కొక్కరుగా జైలు బాట పడుతున్నారు. అటు పక్క బిఆర్ఎస్ కారుని కాళీ చేసే పనిలో ఉంది కాంగ్రెస్, ఇటు పక్క వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిచే పనిలో ఉన్నారు కూటమి నేతలు.

ఎటు చూసిన ఈ రెండు పార్టీలు ఇప్పుడున్న పరిస్థితులలో రాష్ట్రంలో తిరిగి పుంజుకుని రాజకీయాలు చేసే అవకాశం కనుచూపు మేరలో కనిపించడం లేదు. మీడియా ముందు మేకపోతు గాంభీర్యాలు పోతూ లోలోపల కన్నీరే మిగిలిందిక నేస్తం అంటూ భయం గుప్పిటలో ముందస్తు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.