చంద్రబాబు గల్లీ నాయకుడు కంటే తక్కువ… కేటీఆర్ ఎద్దేవా

KTR sattire on Chandrababu Naiduఇటీవలే ఎన్నికలలో ఘన విజయం సాధించి ఆ తరువాత వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమింపబడిన కేటీఆర్ మొట్ట మొదటి సారిగా మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోకి తెరాస వెళ్ళడం ఖాయమని అది ఏ రూపంలోనే త్వరలోనే తెలుస్తుందని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఏపీలో ఒక బలమైన ప్రాంతీయ శక్తి గెలవడం తాము కోలుకుంటున్నామని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అయితే ఏ పార్టీ అనేది మాత్రం ఆయన చెప్పలేదు.

ADVERTISEMENT

[m9ad]

ఇదే క్రమంలో ఆయన చంద్రబాబు నాయుడు ఒక గల్లీ నాయకుడు కంటే తక్కువనే ఎద్దేవా చేశారు. “ఆయనను మీ మీడియా వాళ్ళు ఎందుకు ఆకాశానికి ఎక్కువ అవుతారో అర్ధం కాదు. నా దృష్టిలో ఆయన ఒక గల్లీ నాయకుడు కంటే తక్కువ. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి లో ఆయన రాహుల్ గాంధీ గల్లీ గల్లీకి తిరిగారు. నాకంటే ఎక్కువ తిరిగారు. కానీ ఏమైంది? రెండూ ఓడిపోయారు. ఎన్ని మీటింగ్లు పెట్టారు ఇక్కడ? ఇంత తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు,” అని కేటీఆర్ అన్నారు.

“2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ గానీ, భాజపా గానీ స్వతహాగా గెలుపొందే అవకాశం లేదు. రెండూ కలిసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యలేవు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న 17 లోక్‌సభ స్థానాల్లో 16 చోట్ల తెరాస గెలుస్తుంది. దేశ ప్రధానిని నిర్ణయించే నిర్ణయాత్మక శక్తి తెలంగాణకు వస్తుంది. తెలంగాణలో అమలౌతున్న పథకాలు దేశవ్యాప్తంగా రావాలంటే తెరాస జాతీయ రాజకీయాల్లోకి క్రియాశీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. దేశ రాజకీయాలలో గుణాత్మక మార్పు తెచ్చే శక్తి తెరాసకు ఉంది.’’ అని కేటీఆర్‌ అన్నారు.

ADVERTISEMENT
Latest Stories