కేటీఆర్…ఇండస్ట్రీని రేవంత్ కి దూరం చెయ్యాలనుకుంటున్నారా.?

KTR comments on Revanth Reddy creating debate over Telangana film industry relations

తెలంగాణ రాజకీయాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి vs బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నట్టుగా సాగుతున్నాయి. రేవంత్ పోవాలి కేసీఆర్ రావాలి అనే నినాదంతో బిఆర్ఎస్ ముందుకెళ్తున్న తరుణంలో కేటీఆర్ తన వ్యాఖ్యలతో రేవంత్ అస్తిత్వాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారా.?

తాజాగా రేవంత్ ను ఉద్దేశిస్తూ ఆయనకు ఐడెంటిటీ క్రైసిస్ ఉందని, నిన్న ఓ ఫంక్షన్ లో యాంకర్ ముఖ్యమంత్రి రేవంత్ పేరు మర్చిపోయి శ్రీధర్ బాబు అని పిలిచారని, యాక్టర్లు సైతం ముఖ్యమంత్రిగా రేవంత్ ను గుర్తు పెట్టుకోవడం లేదంటూ ఇండస్ట్రీ కు రేవంత్ కి మధ్య గ్యాప్ పెంచే ప్రయత్నం చేసారు కేటీఆర్.

ADVERTISEMENT

పుష్ప – 2 రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట, ఆ పై జరిగిన ఊహించని పరిణామాలు రేవంత్ సర్కారు vs టాలీవుడ్ అన్నట్టుగా సాగిన తరుణంలో ఆ వివాదం కొన్ని రోజులకు పూర్తిగా సద్దుమణిగిపోయింది. ఆ తరువాత ఇండస్ట్రీ కి రేవంత్ సర్కారు కు మధ్య సానుకూల వాతావరణం ఏర్పడడంతో తెలంగాణ రాజకీయాల నుంచి ఈ అంశం దాదాపు కనుమరుగయిపోయిందనే చెప్పాలి.

గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం, టిక్కెట్ రేట్ల పెంపు విషయంలో రేవంత్ సర్కార్ ఇండస్ట్రీకి అనుకూలంగా ఉండడం, అల్లు స్టూడియో ప్రారంభవేడుకలు సీఎం రేవంత్ చేతుల మీద జరగడం వంటి అంశాలు రేవంత్ ని ఇండస్ట్రీకి దగ్గర చేసాయి.

అయితే తాజగా కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలతో ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో మరోసారి ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది. యాంకర్లు, యాక్టర్లు రేవంత్ రెడ్డి పేరును గుర్తు పెట్టుకోవడం లేదని మాట్లాడుతూ కేటీఆర్ పరోక్షంగా ఇండస్ట్రీ ని రేవంత్ కి ప్రత్యర్థిగా మార్చబోతున్నారా.?

ఇప్పుడిప్పుడే రేవంత్ కు దగ్గరవుతున్న సినీ ఇండస్ట్రీని కేటీఆర్ తన వ్యాఖ్యలతో దూరం చెయ్యాలనుకుంటున్నారా.? అందుకే యాంకర్లు, యాక్టర్లు అంటూ కేటీఆర్ రేవంత్ టార్గెట్ గా విమర్శలు సంధించారా.?

ADVERTISEMENT
Latest Stories