పవన్ కు కేవీపీ లేఖ – వివాదం మరో మలుపు తిరగనుందా.?

KVP Letter to Pawan Kalyan

జూన్ – 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టి. జనసేన ఏర్పాటు చేయాలనుకున్న నవ నిర్మాణ సభ, అటు పై నిర్వహించిన ప్రెస్ మీట్ రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో పెద్ద దుమారాన్నే సృష్టించాయి. తెలంగాణ రాజకీయ పార్టీల నాయకుల నుంచి తెలంగాణ రాజకీయ విశ్లేషకుల వరకు పవన్ టార్గెట్ గా ప్రాంతీయవాద రాజకీయాన్ని తెరమీదకు తెచ్చి పవన్ పై విరుచుకుపడ్డారు.

అయితే వీరందరి విమర్శలకు కౌంటర్ గా పవన్ చేసిన ప్రసంగం ఇప్పుడు తెలంగాణ నేతలతో పాటుగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆత్మబంధువు గా చెప్పుకునే కేవీపీ కి ఆగ్రహం తెప్పించింది.

ADVERTISEMENT

పవన్ తన ప్రెస్ మీట్ లో గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో తన పై జరిగిన రాజకీయ బెదిరింపులు, ఆ సందర్భంగా తన పై నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన కేసుల గురించి, పెట్టాలనుకున్న కేసుల గురించి ప్రస్తావించారు. కాంగ్రెస్ పేరు చెప్పగానే పవన్ కు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు గుర్తు రావడం అభినందనీయం అన్న కేవీపీ వైఎస్సార్ కి వైఎస్సార్ కాంగ్రెస్ కి ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.

అలాగే పవన్ వైఎస్ఆర్ టార్గెట్ గా చేసిన ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా కేవీపీ రామచంద్రరావు పవన్ కు ఒక బహిరంగ లేఖ రాసారు. వైఎస్సార్ మరణించి ఇప్పటికి 17 వసంతాలు గడిచినా ఇంకా ఆయన టార్గెట్ గా పవన్ రాజకీయ విమర్శలు చెయ్యడం మానుకోవాలన్నారు.

ఇక పవన్ ఆరోపించినట్టుగా వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పవన్ పై ఎటువంటి కేసులు పెట్టలేదని, పవన్ కు అలా చెప్పిన ఆ పోలీస్ అధికారి కి వెంటనే లై డిటెక్టర్ టెస్ట్ చేయించాలని, పవన్ ఆరోపించినట్టుగా అధికారి చెప్పినట్లయితే తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కి తానూ 10 కోట్లు విరాళంగా అందిస్తానంటూ సవాల్ విసిరారు కేవీపీ.

అలాగే ఇక ఇప్పటికైనా పవన్ గతం తాలూకా రాజకీయాలను తవ్వుకుంటూ సమయం వృధా చేయకుండా ఏపీ ఉపముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పై ఫోకస్ పెట్టాలంటూ సూచించారు. అలాగే రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి బాబుతో కలిసి బీజేపీ పై ఒత్తిడి తేవాలంటూ హితవు పలికారు.

అయితే తెలంగాణ లో పవన్ ఏర్పాటు చెయ్యాలనుకున్న ఒక్క నవనిర్మాణ సభ అటు తెలంగాణలో ప్రాంతీయవాద రాజకీయ చిచ్చు పెడితే ఇటు ఏపీలో గత కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్సార్ కేంద్రంగా కేవీపీ రాజకీయం మొదలుపెట్టి వైసీపీ శ్రేణులను మరింత రెచ్చకొట్టి jsp vs వైసీపీ అన్నట్టుగా మరోచిచ్చుకు నిప్పుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇక కేవీపీ ప్రకటనలతో ఈ వివాదం ఇప్పుడు మరో కీలక మలుపు తిరగనుందా.?

ADVERTISEMENT
Latest Stories