నిప్పు ఉప్పు కలిసాయి, చేతులు కలిపిన కేసీఆర్ లగడపాటి

Lagadapati - Rajagopal - KCRతెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ లగడపాటి రాజగోపాల్ మధ్య జరిగిన వైరం ఎవరు మర్చిపోలేరు. కేసీఆర్ అప్పట్లో సీమాంధ్ర వారి పై పేల్చిన మాటల తూటాలకు అంతకంటే ఎక్కువగా సమాధానం చెప్పేవారు లగడపాటి. అయితే కేసీఆర్ తెలంగాణ తెచ్చి ముఖ్యమంత్రి అయ్యారు లగడపాటి రాజకీయ సన్యాసం చేసారు.

ADVERTISEMENT

అయితే అనుకోని విధంగా లగడపాటి నిన్న తెలంగాణ ముఖ్యమంత్రిని కలిశారు. తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానించారు. కేసీఆర్ కూడా గతాన్ని మర్చి లగడపాటికి కుశల ప్రశ్నలు వేశారు. తనని కలవడానికి వచ్చిన లగడపాటి బానే మర్యాద చేశారట. పెళ్లికి తప్పకుండా వస్తా అని చెప్పారట.

విశ్వసనీయ సమాచారం ప్రకారం వారిద్దరి మధ్య ఎలాంటి రాజకీయ చర్చలు రాలేదట. కేసీఆర్ అడిగితే లగడపాటి తన తెలంగాణ సర్వే ఫలితాలు చెప్పేవారేమో! మరోవైపు లగడపాటి మళ్లీ రాజకీయ అరంగేట్రం చేస్తారని టీడీపీ నుండి ఎంపీగా పోటీ చేయబోతున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి అయితే వాటిని ఆయన తోసిపుచ్చుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories