లక్ష్మి పార్వతి ఇంత హీనంగా మాట్లాడారా… లోకేష్ చంద్రబాబుని పొడిచెయ్యాలంట

Lakshmi Parvathi comments on Nara Lokeshలక్ష్మీపార్వతికి చంద్రబాబు నాయుడుకు ఉన్న వైరం అందరికి తెలిసిందే. చంద్రబాబు మీద ఉన్న పగతో ఆమె వైఎస్సాఆర్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఏకంగా ఎన్నికల్లో ఓడిపోతారనే భయంతోనే జగన్‌ను అంతమొందించేందుకు చంద్రబాబునాయుడు ‘ఆపరేషన్‌ గరుడ’ పేరుతో స్కెచ్‌ వేశారని వైసీపీ నేత లక్ష్మీపార్వతి ఆరోపించారు,

ADVERTISEMENT

[m9ad]

అంతటితో ఆగకుండా “ఈ దాడి ఘటనపై లోకేష్‌ దిగజారిపోయి మాట్లాడుతున్నాడు. కోడి కత్తి చాలా చిన్నదని అంటున్నాడు. అలాఅయితే.. అదే కొడికత్తితో మీ నాన్న చంద్రబాబును పొడిచి సానుభూతి తెచ్చుకో” అని ఆమె సూచించారు. ‘ప్రత్యక్ష రాజకీయాలు చేయడం రాకే చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలు, ఫిరాయింపు రాజకీయాలు చేశాడు. ఇప్పుడు హత్యా రాజకీయాలకు కూడా తెగబడ్డాడు’ అని లక్ష్మీపార్వతి విమర్శించారు.

‘మన కుటుంబసభ్యులను ఎన్నో వివాదాల నుంచి కాపాడిన వైఎస్‌ కుటుంబసభ్యులకు కీడు చేస్తున్నావు. నీ మిత్రుడు కొడుకు పైన హత్యా రాజకీయాలు చేస్తావా? లోకేష్‌ను ప్రజలపై బలవంతంగా రుద్దేందుకు జగన్‌ను చంపించేందుకు సిద్ధపడతావా? ఇక పై నిన్ను అల్లుడిగా పిలవాలన్నా సిగ్గుగా వుంది. ఇకపై అల్లుడు అని ‌కూడా చెప్పుకోను’ అని చంద్రబాబును ఉద్దేశిస్తూ లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. లక్ష్మి పార్వతి చంద్రబాబుని అల్లుడు అని చెప్పుకోకపోవడం ఏంటి? ఇప్పటికే నందమూరి కుటుంభంలోఎవరు ఆవిడను తమ మనిషి అని చెప్పు కోవడం లేదుగా

ADVERTISEMENT
Latest Stories