సంప్రదాయ పాత్రలు వద్దు, బోరు కొట్టేసింది బాబోయ్… అంటూ వివిధ సందర్భాలలో ఆవేదన వ్యక్తపరిచిన టాలీవుడ్ బ్యూటీ లావణ్య త్రిపాఠికి ఎట్టకేలకు గ్లామరస్ రోల్స్ వస్తున్నాయి గానీ, అంతకుముందు వెతుక్కుంటూ వచ్చిన సక్సెస్ మాత్రం వెనక్కి వెళ్ళింది. ఈ క్రమంలో సినీ అవకాశాలు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ, తాజాగా ఇచ్చిన ఓ ఫోటోషూట్ తో నెటిజన్ల చూపును తన వైపుకు తిప్పుకునేలా చేసింది లావణ్య.
ADVERTISEMENT
సౌత్ ఇండియాకు చెందిన రిట్జ్ మ్యాగ్ జైన్ కు ఇచ్చిన ఫోటోషూట్ లో హాట్ హాట్ గా దర్శనమిచ్చింది లావణ్య. ఇప్పటివరకు ఇంత హాట్ లుక్ లో కనిపించకపోవడంతో, సదరు ఫోటోషూట్ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆరంజ్ కలర్ లో వేసుకున్న లాంగ్ గౌన్ లో వీక్షకులను పిచ్చెక్కిస్తోన్న లావణ్యకు భారీ ప్రాజెక్ట్ లు మాత్రం దరిచేరడం లేదు. బహుశా ఈ ఫోటోషూట్ తర్వాత అయినా వస్తాయేమో చూడాలి!
ADVERTISEMENT



