ఫోటోషూట్… ఫుల్ క్లిక్స్..!

Lavanya-Tripathi-RITZ-Magazine-Photoshootసంప్రదాయ పాత్రల్లో కనిపించినంత కాలం ఊహించని సక్సెస్ లు దరిచేరగా, కాస్త గ్లామరస్ లుక్ కు మారేటప్పటికీ, వచ్చిన సక్సెస్ తో పాటు ఉన్న క్రేజ్ కూడా తగ్గిపోతూ రావడం ఒక్క లావణ్య త్రిపాఠి విషయంలోనే జరుగుతోంది. ఇటీవల రిట్జ్ మ్యాగ్ జైన్ కు ఇచ్చిన కవర్ పేజి ఫోటో హాట్ హాట్ గా దర్శనమివ్వడంతో సోషల్ మీడియా వైరల్ అవుతూ సందడి చేయగా, తాజాగా ఈ ఫోటోషూట్ కు సంబంధించిన ఫుల్ పిక్చర్స్ బయటకు వచ్చాయి.

ADVERTISEMENT

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇన్నాళ్ళు గడిచినా… గడిచిన ఏడాది కాలంగానే లావణ్య కాస్త ఎక్స్ పోజింగ్ కాస్ట్యూమ్స్ ను ధరిస్తోంది. ఆ మధ్యన హైదరాబాద్ లో జరిగిన ఓ సినీ అవార్డుల వేడుకలో బ్లాక్ డ్రెస్ లో మైమరపించిన త్రిపాఠి, తాజాగా అదే బ్లాక్ తో మరోసారి వీక్షకులకు కన్నులవిందు చేస్తోంది. అలాగే ఫ్రాక్ వేసుకుని కూర్చున్న మరో ఫోటో కూడా ఈ ముద్దుగుమ్మ అభిలాషకు అద్దం పట్టేలా ఉంది.

ADVERTISEMENT
Latest Stories