హాస్పిటల్ కు చేరుకునే సమయానికే అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమ పరిస్థితిలో ఉందని, దానికి తోడు బిపి, షుగర్ ఉండడంతో కోలుకోలేకపోయారని జయలలితకు వైద్యం అందించిన రిచర్డ్ బేలే చెప్పిన విషయం తెలిసిందే. జయలలిత మృతిపై రకరకాల ఊహాగానాలు తలెత్తడంతో… అసలు దీని వెనుక ఉన్న మిస్టరీ ఏంటో తేల్చాలని చాలామంది చాలా రకాలుగా డిమాండ్ చేసారు. ఒకప్పటి హీరోయిన్ గౌతమి అయితే ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీకే లేఖ రాసి అవాక్కు చేసారు.
ఈ నేపధ్యంలో… జయలలిత మృత్యువు రహస్యాన్ని బయటపెట్టేందుకు చెన్నై అపోలో ఆసుపత్రి యాజమాన్యం వివరణ ఇచ్చుకున్న విషయం తెలిసిందే. అలాగే తాజాగా జయకు వైద్యం అందించిన లండన్ డాక్టర్ కూడా స్పష్టం చేసారు. అయితే ఈ వివరణలపై జయ మేనకోడలుతో సహా నటిమణి గౌతమీ పలు సందేహాలను వ్యక్తం చేసారు. సీఎం స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి తన ఆరోగ్య పరిస్థితి విషమించే వరకు పరీక్షలు చేయించుకోకుండా ఎలా ఉంటారని ప్రశ్నించారు.
అలాగే ముందుగా జయలలితను లండన్ తరలిస్తామన్న డాక్టర్ రిచర్డ్, తర్వాత ఎందుకు మాట మార్చారని, జయలలితను చూసేందుకు తనను అనుమతించలేదని తమిళనాడు గవర్నర్ తన ప్రెస్ నోట్ లో నాడు పేర్కొన్నారని, కానీ, గవర్నర్ ను చూసి జయ చేయి ఊపారని రిచర్డ్ ఎందుకు తప్పుదారి పట్టించారని ప్రశ్నించారు. జయకు చికిత్స చేసినందుకు గాను 5.2 కోట్ల బిల్లును జయ కుటుంబ సభ్యులు చెల్లించారని చెప్పిన వైద్యులు, సదరు బిల్లులను ఎవరు చెల్లించారో తనకు చెప్పాల్సిందిగా దీప డిమాండ్ చేసారు.
Win Rs.1000 Paytm for closest guess of @Suriya_offl 's #Singam3 Telugu USA Premiere Collections by Wednesday 7 pm IST #M9NewsWin1000 pic.twitter.com/56Mywd856M
— M9News (@M9News) February 6, 2017



