టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క గత కొంత కాలంగా సినిమాలతో చాలా బిజీగా ఉంటుంది. అయినా కూడా అనుష్క పెళ్లి వార్తలు మీడియాలో అప్పుడప్పుడు సందడి చేస్తూనే ఉన్నాయి. అనుష్కకు పెళ్లి ఫిక్స్ అయ్యిందని, అనుష్క ప్రేమ వివాహం చేసుకోబోతుందని, అనుష్క ‘బాహుబలి’ సినిమా పూర్తి అయిన తర్వాత పెళ్లి చేసుకుంటుంది అంటూ పలు వార్తలు ఇప్పటి వరకు మీడియాలో వచ్చాయి. తాజాగా తన పెళ్లిపై అనుష్క ఒక క్లారిటీ ఇచ్చింది. తాను పెళ్లికి మూడు సంవత్సరాల క్రితమే సిద్దం అయ్యాను అని, అయితే సరైన వరుడు దొరకక పోవడం వల్లే తన పెళ్లి ఆలస్యం అవుతుందని చెప్పుకొచ్చింది.
సంక్రాంతి పండగ సందర్బంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన ముద్దుగుమ్మ అనుష్క తగిన వరుడు తారస పడితే ఏ క్షణంలో అయినా పెళ్లికి రెడీ అని అనుష్క అంటోంది. ప్రస్తుతం ఈమె ‘బాహుబలి’ రెండవ పార్ట్‌లో నటిస్తున్న విషయం తెల్సిందే. మరో వైపు ఈమెతో కృష్ణవంశీ ఒక హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. వరుడు దొరికే వరకు వరుసగా సినిమాలు చేస్తూనే ఉంటుందట ఈ అమ్మడు. ప్రభాస్‌కు వదువు దొరికే సమయానికి అనుష్కకు వరుడు దొరికేనా అనే జోక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.





