ఒకానొక సమయంలో ‘గంగమ్ స్టైల్’ అనే పాట సంగీత ప్రపంచాన్ని ఒక ఊపు ఊపి యూ ట్యూబ్ సరికొత్త రికార్డులు నెలకొల్పిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాదిలో జనవరి 12న విడుదలైన ‘డేస్పాసిటో’ అనే స్పానిష్ భాషకు సంబంధించిన పాట యూ ట్యూబ్ ఆల్ టైం రికార్డును బీట్ చేసి సరికొత్త రికార్డులను నెలకొల్పింది.
ADVERTISEMENT
విడుదలై ఒక ఏడాది సమయానికి దగ్గర పడుతోన్న ఈ పాట ఇప్పటివరకు దాదాపుగా 455 కోట్లకు పైగా క్లిక్స్ ను అందుకోవడం చెప్పుకోదగ్గ విషయం. అంతేకాదు 24 మిలియన్స్ లైక్స్ ను, 19 లక్షలకు పైగా కామెంట్స్ ను సొంతం చేసుకుంది. ఇన్ని రికార్డులు సృష్టించిన ఈ పాటకు 2 మిలియన్ డిస్ లైక్స్ కూడా వచ్చాయిలెండి.
ADVERTISEMENT



