వార్నింగ్… ఈ టాప్ బ్యూటీలకేనా..?

Maa president warning to actressesత్వరలో సిల్వర్ జూబ్లీ జరుపుకోనున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సెలబ్రేషన్స్ గురించిన వివరాలను మీడియాకు వెల్లడిస్తున్న వేళ, మా అధ్యక్షుడు, నటుడు శివాజీరాజా కొందరు హీరోయిన్లను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మా నిర్వహించే కార్యక్రమాలకు హీరోయిన్లు హాజరు కావడం లేదని, పలువురిని తెలుగు చిత్ర పరిశ్రమ పెంచి పోషిస్తుంటే, వారు కనీసం ఆర్టిస్టుగా సభ్యత్వం కూడా తీసుకోవడం లేదని, అలాంటి వారి తోకలను కత్తిరిస్తామని హెచ్చరించాడు.

ADVERTISEMENT

ఇక శివాజీరాజా హెచ్చరించింది ప్రముఖ హీరోయిన్లు కాజల్, తమన్నాలకేనని టాలీవుడ్ లో గుసగుసలు వినపడుతున్నాయి. వీరు ఎన్నిసార్లు అసోసియేషన్ ప్రతినిధులు ఆహ్వానించినా, కేర్ చేయడం లేదని, కాస్తంత గట్టిగా అడిగితే, డబ్బు కావాలని డిమాండ్ చేస్తున్నారని, అందుకే శివాజీరాజాకు అంత కోపం వచ్చిందని టాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. శివాజీరాజా వార్నింగ్ ఎవరికిచ్చినా, ఇకనుంచైనా తెలుగు చిత్రాల్లో నటిస్తూ, కోట్లాది రూపాయల డబ్బును సంపాదిస్తున్న నటీమణులు దారికి వస్తారేమో వేచి చూడాలి.

ADVERTISEMENT
Latest Stories