మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి కూకట్ పల్లిలో ఓడిపోతే?

Mahakutami Leaders Celebrating Early?ఈ నెల 7వ తారీఖున తెలంగాణ పోలింగ్ లో పూర్తి అయ్యింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమయ్యి ఉంది. రేపు ఓట్ల లెక్కింపు తరువాత ఫలితాలు అధికారికంగా వెల్లడవుతాయి. ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఎలా ఉన్నా తెలంగాణాలో తెలుగు దేశం పార్టీకి జీవన్మరణ సమస్య వంటివి. ఇప్పటికే విభజన, ఓటుకు నోటు కేసుతో దిక్కు తోచని స్థితిలో ఉన్న ఆ పార్టీ తన అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి కాంగ్రెస్ తో చేతులు కలిపింది. పొత్తు విజయవంతం కావడం కోసం సీట్ల పంపకంలో కొన్ని త్యాగాలు కూడా చేసింది.

[m9ad]

ADVERTISEMENT

శ్రేణులను సంఘటితం చెయ్యడానికి కూకట్ పల్లి నుండి దివంగత హరికృష్ణ కుమార్తె సుహాసినిని దింపారు. చదువుకున్న ఓటర్లు, సెట్లర్లు, సామాజిక వర్గం లెక్కల ప్రకారం కూకట్ పల్లి తెలంగాణాలో టీడీపీకి అత్యంత అనుకూలమైన సీట్లలో ఒకటి. దీనితో అక్కడ పార్టీ గెలుపు కీలకం కాబోతుంది. కూకట్ పల్లిలో టీడీపీ గనుక ఓడిపోతే మహాకూటమి అధికారం లోకి వచ్చినా తెలుగుదేశం సామర్ధ్యం మీద అనుమానాలు అనేవి పోవు. ఒకవేళ మహాకూటమి అధికారంలోకి రాకుండా కూకట్ పల్లిలో ఓడిపోతే అది టీడీపీకి ప్రాణసంకటంగా పరిణమించవచ్చు.

కూకట్ పల్లిలో సుహాసిని పోటీ వల్ల నందమూరి కుటుంబంలో ఇంకా లుకలుకలు ఉన్నాయనేది స్పష్టం అయ్యింది. జూనియర్ ను కలుపుకోవడానికి పార్టీ, బాలకృష్ణ రెడీగా ఉన్నా తారక్ అందుకు ఇంకా సిద్ధంగా లేడు అని తెలియజెప్పింది. ఒకవేళ మహాకూటమి అధికారంలోకి వచ్చి కూకట్ పల్లిలో టీడీపీ ఓడిపోతే తారక్ ను నిందించేవారు కూడా ఉంటారు. అది శ్రేణుల మధ్య కొత్త ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి కూకట్ పల్లిలో ఫలితం ఎలా ఉండబోతుంది అనేది సర్వత్రా ఆసక్తి కలిగిస్తుంది.

కూకట్ పల్లిలో 2014 ఎన్నికల కంటే స్వల్పంగా ఓటింగు శాతం పెరిగింది. అయినా ఇప్పటికీ రాష్ట్రంలో నమోదైన అత్యల్ప పోలింగ్ శాతాలలో కూకట్ పల్లి కూడా ఒకటి. అయితే రాష్ట్రంలో అత్యధికంగా ఓట్లు గల్లంతు అయ్యింది కూడా ఇక్కడే. అది కూడా ఓటింగు మీద ప్రభావం చూపించిందని సమాచారం అందుతుంది. స్వర్గీయ ఎన్టీఆర్ తరువాత నందమూరి కుటుంబం తెలంగాణాలో పోటీ చేసింది లేదు. గతంలో ఒకసారి సాక్షాత్తు ఎన్టీఆర్ తెలంగాణాలో ఓడిపోయారు. కాబట్టి గెలుపు ఓటములకు ఎవరూ అతీతులు కాదు. ఈసారి ఏం జరగబోతుందో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories