షూటింగ్ పూర్తి… ఆన్ టైం రిలీజ్..!

Mahanati Releaseనాగ్ అశ్విన్ దర్శకత్వంలో .. కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రలో ‘మహానటి’ సినిమా రూపొందింది. సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా రానున్న ఈ సినిమా, బుధవారం నాటితో షూటింగు పార్టును పూర్తి చేసుకుంది. దాంతో ఈ సినిమా టీమ్ షూటింగుకి గుమ్మడికాయ కొట్టేశారు. యూనిట్ సభ్యులంతా కలిసి… సావిత్రి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

ADVERTISEMENT

యూనిట్ సభ్యులంతా చాలా రోజులుగా ఈ సినిమా చేస్తూ వచ్చారు. దీంతో సావిత్రి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి తెలుసుకుని వాళ్లు కదిలిపోయారు. ఆ సంఘటనలను గుర్తుచేసుకుని .. షూటింగు ముగింపు రోజున అంతా కన్నీళ్లు పెట్టుకున్నారట. భారీ తారాగణంతో… భారీతనాన్ని సంతరించుకున్న ఈ సినిమాను, తెలుగు, తమిళ భాషల్లో మే 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ADVERTISEMENT
Latest Stories