మహేష్ సినిమాకు రేసులోకొచ్చిన సరికొత్త టైటిల్!

mahesh-ar-murugadoss-new-titleమురుగదాస్ దర్శకత్వంలో నటిస్తోన్న ప్రిన్స్ మహేష్ బాబు సినిమా టైటిల్ ఓ కొలిక్కి వచ్చే విధంగా కనపడడం లేదు. ఇప్పటికే పలు రకాల టైటిల్స్ ట్రేడ్ వర్గాల్లో, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా, వాటికి తోడు తాజాగా మరో టైటిల్ తెరపైకి వచ్చింది. ఇటీవల ఓ ఆడియో వేడుక మీద పివిపి “సంభవామి యుగే యుగే” టైటిల్ ను ప్రకటించడంతో, దాదాపుగా ఇదే చివరి టైటిల్ గా ప్రిన్స్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. కానీ, ఈ టైటిల్ మాస్ వర్గాలకు పెద్దగా రీచ్ కాదన్న ఉద్దేశంతో ప్రత్యామ్నాయంగా మరో టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నారనేది లేటెస్ట్ న్యూస్.

తల్లి కడుపులో ఉండే పద్మవ్యూహాన్ని చేధించిన “అభిమన్యుడు” పేరునే ఈ సినిమాకు టైటిల్ గా పెట్టనున్నారనేది తాజా సమాచారం. “అభిమన్యు” పేరుతో ఇప్పటికే కళ్యాణ్ రామ్ ఒక సినిమా చేయగా, అది అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. దీంతో అదే టైటిల్ ను ప్రిన్స్ సినిమాకు పెడతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. బహుశా ఈ సినిమా స్క్రిప్ట్ పైన కూడా మురుగదాస్ ఇన్నాళ్ళు కష్టపడి ఉండకపోవచ్చు గానీ, సినిమా పేరు విషయంలో మాత్రం ఎన్నాళ్ళుగా ఆలోచిస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. ఎలాగైనా ఈ నెలాఖరుకు ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేయనున్న నేపధ్యంలో… అతి త్వరలోనే టైటిల్ ను ఖరారు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories