30 సెకన్ల మహేష్ టీజర్ కు భారీ హంగామానా?

Mahesh-Babu-A-R-Murugadoss-teaserమురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మాణం అవుతోన్న సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. గత మూడు, నాలుగు నెలలుగా ఇదిగో ఫస్ట్ లుక్ అంటూ చేస్తున్న హంగామా ప్రస్తుతం తుది దశకు చేరుకున్నట్లుగా కనపడుతోంది. ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా అనేక తర్జనభర్జన పడిన చిత్ర యూనిట్, ఫైనల్ గా ఒక నిర్ణయానికి వచ్చిందని సమాచారం.

“సంభవామి” టైటిల్ కే చిత్ర యూనిట్ మొగ్గుచూపినట్లుగా సమాచారం అందుతుండగా, ఈ సినిమా ఫస్ట్ టీజర్ కోసం కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ట్రేడ్ టాక్. 30 సెకన్ల పాటు కట్ చేసిన ఫస్ట్ టీజర్ లోనే ఈ సినిమా కధ యొక్క థీమ్ తెలిసే విధంగా జాగ్రత్తలు తీసుకుంటుండగా, అలాగే ఈ టీజర్ కటింగ్ ను లండన్ లో ప్రత్యేకంగా చేయిస్తున్నట్లుగా సమాచారం. ముఖ్యంగా గ్రాఫికల్ ఎపిసోడ్స్ కోసం లండన్ వైపుకు మొగ్గుచూపినట్లుగా తెలుస్తోంది.

ADVERTISEMENT

అయితే కేవలం 30 సెకన్ల నిడివి గల టీజర్ కటింగ్ కోసం ఇంత హంగామా అవసరమా? అంటే ఫస్ట్ లుక్ లోనే అందరినీ పడేయడానికి దర్శకుడు మురుగదాస్ పలు జాగ్రత్తలు తీసుకుంటూ, కీలకమైన సూచనలు చేస్తూ ఈ టీజర్ ను రూపొందిస్తున్నట్లుగా సినీ జనాల సమాచారం. మహేష్ కెరీర్ లో తొలిసారిగా తమిళంలో కూడా విడుదల కానుండడంతో, పబ్లిసిటీ భారీ స్థాయిలోనే ఇచ్చే విధంగా నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట.

ADVERTISEMENT
Latest Stories