సీక్రెట్ ఏజెంట్ గా ప్రిన్స్ మహేష్ బాబు?

Mahesh Babu,mahesh babu character, murugadoss movie, secret agent,mahesh next film with  AR Murugadoss , Tollywood, Super Star mahesh babu,brahmotsavam‘బ్రహ్మోత్సవం’ కొట్టిన దెబ్బకు మురుగదాస్ దర్శకత్వంలో నటించబోయే తన కొత్త సినిమాకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడని వార్తలు వస్తున్న నేపధ్యంలో… ప్రిన్స్ మహేష్ బాబు పాత్రపై ఇప్పటికే రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. న్యాయవ్యవస్థపై సాగే ఈ కధలో ప్రిన్స్ లాయర్ పాత్రలో మెరవబోతున్నారని కొందరు అంటుంటే… కాదు కాదు… ప్రిన్స్ కు అచ్చి వచ్చిన పోలీస్ కాప్ గా మరోసారి కనిపించబోతున్నారని మరికొందరు అంటున్నారు.

అయితే, తాజాగా పుట్టుకొచ్చిన మరొక విషయమేమిటంటే… ఓ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో ప్రిన్స్ దర్శనం ఉండబోతోందని టాక్ ఊపందుకుంది. మరి ఈ మూడు పాత్రల్లో ప్రిన్స్ ఎలా సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయబోతున్నారో లేక ఈ మూడు కాక మరొక పాత్రలో నటిస్తారో లేదో ఇప్పుడే చెప్పలేం గానీ, ఈ సినిమా కోసం ప్రిన్స్ మేకోవర్ కాబోతున్నారని మాత్రం పక్కా సమాచారం. ఈ రోల్ కోసం తన కెరీర్లోనే తొలిసారిగా ప్రిన్స్ గడ్డం పెంచుకుని సిద్ధమవుతున్నారని ఓ టాక్.

ADVERTISEMENT

అలాగే ఈ సినిమా నిర్మాణంలో మొత్తం అయిదుగురు భాగస్వామ్యం కాబోతున్నారని సినీ వర్గాల సమాచారం. ఠాగూర్ మధు, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, ఫాక్స్ స్టూడియోస్ వంటి నిర్మాణ దిగ్గజాలతో పాటు, చిత్ర దర్శకుడు మురుగదాస్, హీరో మహేష్ బాబులు కూడా పాలుపంచుకోబోతున్నారని సమాచారం. దీంతో భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మాణం జరుపుకోబోతుందన్న సంకేతాలను స్పష్టంగా ఇచ్చేస్తోంది.

ADVERTISEMENT
Latest Stories