సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క సర్కారు వారి పాట సినిమా నిర్మాతలు తమ చిత్రంలో కీర్తి సురేష్ ను హీరోయిన్ గా ప్రకటించారు. ఈ రోజు నటి పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటన చేశారు. గత కొన్ని రోజులుగా మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాను పక్కన పెట్టి ముందుగా త్రివిక్రమ్ తో ఒక సినిమా చేస్తాడని పుకార్లు వచ్చాయి.
మహేష్ స్వయంగా హీరోయిన్ ప్రకటన చెయ్యడంతో వాటి మీద క్లారిటీ ఇచ్చినట్టు అయ్యింది. మరో పక్క అభిమానులు హీరోయిన్ ఎంపిక పట్ల సంతోషంగా లేరు. “కీర్తి ఒక క్రేజీ హీరోయిన్ కాదు. అంతేకాక, ఇటీవలి కాలంలో ఆమె చాలా బరువు తగ్గి తన గ్లోని కోల్పోయింది. వారు ఏదన్నా స్టార్ హీరోయిన్ కోసం వెళ్ళాల్సింది” అని అభిమానులు అంటున్నారు.
పవన్ కళ్యాణ్ యొక్క అజ్ఞ్యాతవాసి తరువాత కీర్తికి ఇది రెండవ స్టార్ సినిమా. మరోవైపు… ఈ చిత్రానికి అనిల్ కపూర్‌ను మెయిన్ విలన్‌గా తీసుకోవాలని వారు యోచిస్తునట్టుగా వార్తలు వస్తున్నాయి. అలాగే చిత్రంలో కీలక పాత్ర కోసం విద్యాబాలన్ కూడా సంప్రదించినట్టు అంటున్నారు. అదే జరిగితే, వారిద్దరి చేరికతో సినిమా బాలీవుడ్ మార్కెట్ పెరుగుతుంది.
మరోవైపు షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపై అధికారిక సమాచారం లేదు. మొన్న ఆ మధ్య సినిమాకు లొకేషన్స్ ఫైనల్ చెయ్యడానికి డైరెక్టర్ అమెరికా వెళ్లాడని వార్తలు వచ్చాయి ఆ తరువాత ఏం జరిగిందో కూడా తెలీదు. కాబట్టి షూటింగ్ మీద క్లారిటీ కోసం అభిమానులు వేచి చూస్తున్నారు.




