అర్ధరాత్రి 1 గంటకు మహేష్ ఫ్యాన్స్ హంగామా చూస్తారా!

Mahesh babu craze in Ahmedabadమురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా షూటింగ్ అహ్మదాబాద్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరణ జరుపుతుండగా… వీటిని చూసేందుకు స్థానిక జనాలు, ప్రిన్స్ అభిమానులు పోటేత్తుతుండడం ఊహించని పరిణామం. గుజరాత్ లో మహేష్ ను చూసేందుకు ఇంతమంది జనాలు వస్తారని బహుశా చిత్ర యూనిట్ కూడా అంచనా వేసి ఉండకపోవచ్చు.

ఒకవేళ పగటి పూట షూటింగ్ అయితే…. పని సమయం కాబట్టి సమాచారం తెలుసుకుని క్రౌడ్ వచ్చే ఆస్కారం ఉంది. కానీ, మురుగదాస్ ఈ సినిమా షూటింగ్ ను రాత్రి వేళల్లో జరుపుతున్నా… పెద్ద ఎత్తున జనాలు రావడం పెద్ద ట్విస్ట్. దీనికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. అర్ధరాత్రి 1 గంటల సమయంలో జరుగుతున్న షూటింగ్ కు భారీ ఎత్తున అభిమానులు తరలిరావడంతో… చిత్ర యూనిట్ కూడా మంచి ఉత్సాహంతో సినిమాను సన్నద్ధం చేస్తోంది.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories