అప్పుడప్పుడు ఇలా కనిపిస్తుండవయ్యా!

mahesh-babu-family-celebrates-christmas-photos-2ప్రిన్స్ మహేష్ బాబు కుటుంబం ఏ పండగను కూడా వదిలిపెట్టరేమో అనిపించే విధంగా ప్రతి పండగను చక్కగా ఇంటిల్లిపాది జరుపుకుంటూ సందడి చేస్తుంటారు. ప్రిన్స్ సతీమణి నమ్రత ద్వారా ఆ హంగామాకు సంబంధించిన ఫోటోలు కూడా అభిమానులకు దర్శనమిస్తుంటాయి. తాజాగా క్రిస్మస్ వేడుకను మహేష్ బాబుతో సహా కుటుంబం మొత్తం జరుపుకున్న ఫోటోలు నెట్టింట హంగామా చేస్తున్నాయి.

క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూ ఉదయాన్నే ‘శాంతాక్లాజ్’ పక్కన ఫోటో దిగి అభిమానులను మురిపించిన మహేష్ బాబు ఫోటోల సీక్వెల్స్ లో సాయంత్రం సమయం చేరుకునే సమయానికి ‘శాంతాక్లాజ్’ అవతారంలో మహేష్ కూతురు సితార కనిపించింది. మామూలుగానే ఎంతో క్యూట్ గా కనిపించే సితార, ఈ శాంతాక్లాజ్ కాస్ట్యూమ్స్ లో మరింత ముద్దొచ్చే విధంగా ఉంది. దీంతో మహేష్ ఫోటోలతో సితార పిక్స్ కూడా అభిమానులను అలరిస్తున్నాయి.

ADVERTISEMENT

సహజంగా తన సినిమాల విడుదల సమయంలో తప్ప మహేష్ బాబు ముఖ దర్శనం ఉండదు. మధ్య మధ్యలో నమ్రత పోస్ట్ చేసే ఫోటోలలో కూడా పిల్లలు గౌతమ్, సితారలు కనిపిస్తుంటారు గానీ, మహేష్ నేరుగా కనిపించేది బహు అరుదు.దీంతో ఈ క్రిస్మస్ నాడు నవ్వుతూ కనిపిస్తున్న మహేష్ ను చూస్తూ మురిసిపోవడం అభిమానుల వంతవుతోంది. ఇలా అప్పుడప్పుడు అభిమానులకు దర్శనమిస్తూ ఉంటే… మాకు వచ్చే ఆనందం వేరే కదా… అంటున్నారు ఫ్యాన్స్..!

ADVERTISEMENT
Latest Stories