ఐ మూలగా… ఎంతమందిని పడేసావ్ బాబు..!

Mahesh-Babu--Namrata-Selfie‘జల్సా’ సినిమాలో ఇలియానాకు ప్రేమ పాఠాలు నేర్పుతూ పవన్ కళ్యాణ్ చెప్పే ‘ఐ మూలగా’ చూసే సీన్ బహుశా ప్రేక్షకులెవరూ మరిచిపోయి ఉండకపోవచ్చు. ప్రస్తుతం అదే ‘ఐ మూల’ లుక్ లో ప్రిన్స్ మహేష్ బాబు దర్శనమిస్తున్నాడు. అక్కడ ఎవరిని పడేయడానికి చూస్తున్నాడో గానీ, ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. క్రిస్మస్ వేడుకలతో మొదలైన ఫ్యామిలీ పార్టీలో భాగంగా క్లిక్ మన్న ఫోటో ఇది.

బహుశా కొత్త ఏడాది వేడుకలలో భాగంగా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తున్నారేమో గానీ, ప్రిన్స్ లుక్ మాత్రం అదరగొట్టేస్తున్నాడు. “స్పైడర్” సినిమా నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రిన్స్, ఇంత ఎంజాయ్ మెంట్ మూడ్ లో కనిపించడం ఇదే. పూర్తిగా ‘స్పైడర్’ నుండి బయటకు వచ్చి “భరత్ అనే నేను”పై దృష్టి కేంద్రీకరించారేమో గానీ, మొత్తానికి ప్రిన్స్ దర్శనంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories