మహేష్ ఎంట్రీతో కళకళలాడం ఖాయం!

mahesh-babu-shockeచాలా అరుదుగా మాత్రమే ఇతర సినిమాల ఆడియో వేదికలపై దర్శనమిచ్చే ప్రిన్స్ మహేష్ బాబు, ఈ నెల 27వ తేదీన జరగబోతున్న ఓ సినిమా ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా విచ్చేయనున్నారు. సూపర్ స్టార్ కృష్ణ – విజయనిర్మల తనయుడు నరేష్ కొడుకు నవీన్ విజయకృష్ణ హీరోగా తెరకెక్కిన “నందిని నర్సింగ్ హోం” సినిమా ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా ప్రిన్స్ విచ్చేయడం అభిమానులకు తీపివార్త.

‘బ్రహ్మోత్సవం’ తర్వాత అభిమానులకు మహేష్ బాబు కనపడలేదు. దీంతో ‘నందిని నర్సింగ్ హోం’ ఆడియో వేడుక ప్రిన్స్ అభిమానులతో కళకళలాడం ఖాయంగా చెప్పవచ్చు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో చెన్నైలో జరుగుతున్న షూటింగ్ లో పాల్గొంటున్న ప్రిన్స్, మరికొద్ది రోజుల్లోనే హైదరాబాద్ లో ల్యాండ్ అవనున్నారు. ఇక, ఇటీవలే దిల్ రాజు ఆశీస్సులతో ‘నందిని నర్సింగ్ హోం’ ఫస్ట్ లుక్ విడుదలై, ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories