సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మహేష్ బాబు దూసుకొచ్చాడు. పరాజయాలకు అతీతంగా ఆయన క్రేజ్ .. మార్కెట్ పెరుగుతూ ఉండటం విశేషం. అలాంటి మహేష్ బాబు కంటే ముందుగానే ఆయన అన్నయ్య రమేష్ బాబు తెలుగులో హీరోగా కొన్ని సినిమాలు చేశారు. అయితే ఆ సినిమాలు అంతగా సక్సెస్ ను సాధించకపోవడం వలన, ఆయన సినిమా రంగానికి దూరమయ్యారు.
ADVERTISEMENT
ఇప్పుడు ఆయన తనయుడు ‘జయకృష్ణ’ హీరోగా తెలుగు తెరకు పరిచయం కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కుర్రాడు వైజాగ్ లో సత్యానంద్ దగ్గర నటనలో శిక్షణ తీసుకుంటున్నాడని సమాచారం. వచ్చే ఏడాది జయకృష్ణతో సినిమా ఉండేలా కృష్ణ ఫ్యామిలీ రంగాన్ని సిద్ధం చేస్తోందట. తాతయ్యలా… బాబాయ్ లా ఈ కుర్రాడు దూసుకుపోతాడేమో చూడాలి.
ADVERTISEMENT



