గత కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో మహేష్ బాబు అభిమానులను ఓ ఫోటో ఊపేస్తోంది. ప్రిన్స్ సరికొత్త లుక్ లో కనిపిస్తున్న ఈ ఫోటోలో ఓ రెంచ్ పట్టుకుని జీబును బాగు చేస్తున్నాడు. ఇప్పటివరకు ఇలాంటి గెటప్ లో మహేష్ కనిపించకపోవడంతో ప్రిన్స్ ఫ్యాన్స్ సదరు ఫోటోను షేర్ చేసుకుంటూ నెట్టింట హంగామా చేస్తున్నారు.
గతే ఏడాది జూనియర్ ఎన్టీఆర్ చేత ‘జనతా గ్యారేజ్’ను ఓపెన్ చేయించిన కొరటాల శివ, తాజాగా “భరత్ అనే నేను” ద్వారా మహేష్ బాబుతో కొనసాగిస్తున్నారా? అని అనుకుంటున్నారా! ఇది కొరటాల పుణ్యం కాదు గానీ, మహేష్ బాబు ఒప్పుకున్న ఓ బ్రాండ్ అడ్వర్ టైజ్మెంట్ లో భాగంగా తీసిన స్టిల్ ఇది.
మహేష్ బాబు ఖాతాలో ఉన్న పదుల సంఖ్యలో యాడ్లలో పారాగన్ చెప్పుల సంస్థ ఒకటన్న విషయం తెలిసిందే. దాదాపుగా మూడేళ్ళ నుండి బ్రాండ్ అంబాసిడర్ గా వహిస్తున్న సదరు సంస్థ చిత్రీకరించిన కొత్త యాడ్ లో మహేష్ ఈ విధంగా దర్శనమివ్వనున్నాడు. ‘రఫ్’ లుక్ లో మహేష్ అదిరిపోయాడు… అవసరమైతే మళ్ళీ కొరటాల “జనతా గ్యారేజ్”ను మహేష్ చేత ఓపెన్ చేయించవచ్చు అంటూ ఫ్యాన్స్ కితాబిస్తున్నారు.



