‘భరత్ అనే నేను’పై అంత నమ్మకం ఉందా?

Mahesh Babu Sends Iphone Gifts to Bharat Ane Nenu Direction Teamఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న కొరటాల – ప్రిన్స్ ల “భరత్ అనే నేను” సినిమాపై అంచనాలు పెరిగాయి. టీజర్, ఆడియో, ట్రైలర్… ఇలా అన్నీ సంతృప్తికరంగా ఉండడంతో, అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రేక్షకులు కూడా ‘భరత్ అనే నేను’ కోసం నిరీక్షిస్తున్నారు. ఏప్రిల్ 20వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోన్న ఈ సినిమా, యుఎస్ లో ఒక రోజు ముందుగానే రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.

సాధారణంగా తన సినిమా హిట్టయితే దర్శకులకు ఏదొక బహుమతిని అందివ్వడం ప్రిన్స్ మహేష్ బాబుకు అలవాటు. గతంలో ‘శ్రీమంతుడు’ భారీ సక్సెస్ అయిన తర్వాత కొరటాల శివకు ఓ కారు బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచిన వైనం తెలిసిందే. అయితే రిలీజ్ అయ్యి, బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత సంగతి. కానీ ‘భరత్ అనే నేను’ విషయంలో మాత్రం రిలీజ్ కు ముందే బహుమతులు వెళ్తుండడం విశేషం.

ADVERTISEMENT

అవును… ‘భరత్ అనే నేను’ చిత్ర డైరెక్షన్ డిపార్టుమెంటుకు ‘ఐ ఫోన్ ఎక్స్’లను మహేష్ బాబు తన సతీమణి నమ్రత ద్వారా పంపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. అయితే సినిమా రిలీజ్ కు ముందే ఈ ఫోన్ల బహుమతి ఇచ్చారంటే… ప్రిన్స్ కు ‘భరత్ అనే నేను’ సక్సెస్ పట్ల అంత నమ్మకం ఉందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. గత రెండు సినిమాలు ‘స్పైడర్, బ్రహ్మోత్సవం’ దారుణ పరాజయాలు కావడంతో, ఈ సినిమా సక్సెస్ ప్రిన్స్ కు చాలా అవసరం.

ADVERTISEMENT
Latest Stories