వినాయక నిమజ్జనంలో మహేష్ తనయుడు గౌతమ్!

Mahesh Babu Son Gautham Vinayaka Nimajjanam,  Gautham Krishna Vinayaka Nimajjanam Photos, Mahesh Babu Son Gautham Krishna Vinayaka Nimajjanam Photos 2016తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు తెలిసేలా గౌతమ్, సితారలను పెంచుతున్న మహేష్ – నమ్రతలు ఎప్పటికప్పుడు, వీటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. తాజాగా వినాయకుని నిమజ్జనంలో ప్రిన్స్ తనయుడు గౌతమ్ పాల్గొన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. వినాయకచవితి పండగను జరుపుకున్న తీరుపై నమ్రత, ఇటీవల ఓ ఫోటోను పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.

తాజాగా ఆ వినాయకుని నిమజ్జన కార్యక్రమంలో పాలుపంచుకున్నాడు గౌతమ్. తలకు ‘గణపతి బప్పా మోరియా’ అనే బ్యాండ్ కట్టుకున్న గౌతమ్ లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది. చిన్నప్పటి నుండే దైవ కార్యక్రమాలను అలవాటు చేస్తున్న మహేష్ – నమ్రతలను అభినందించాల్సిందే. విలువలకు వీడ్కోలు ఇచ్చేలా రాబోతున్న తరం ప్రవర్తన ఉంటుండడంతో, వాటికి దూరంగా మహేష్ వంటి సెలబ్రిటీలు తమ పిల్లలను పెంచుతుండడం ఆహ్వానించదగ్గ పరిణామం.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories