మహేష్ కు కంటి తుడుపు!

Mahesh Babu Getting Ill-Advisedతమిళ టాప్ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో దాదాపుగా 120 కోట్ల వ్యయంతో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన “స్పైడర్” సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకున్న ఈ సినిమా సిల్వర్ స్క్రీన్ పైనే కాకుండా, స్మాల్ స్క్రీన్ పైన కూడా విఫలం అయ్యింది. సహజంగా మహేష్ బాబు సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ గనుక, బిగ్ స్క్రీన్ తో సంబంధం లేకుండా బుల్లితెరపై హిట్ అవుతుంటాయి.

తెలుగులో బుల్లితెరపై కూడా విఫలమైన ‘స్పైడర్’కు తమిళ ప్రేక్షకులు పట్టం కట్టడం మహేష్ బాబుకు కాస్త ఊరట కలిగించే అంశం. ముఖ్యంగా ‘బాహుబలి 2’ని అధిగమించి తెలుగు హీరోలలో అత్యధిక టీఆర్పీ అందుకున్న హీరోగా మహేష్ బాబు నిలవడం అనేది… ‘స్పైడర్’కు దక్కిన కంటితుడుపు చర్యగా భావించవచ్చు. తమిళనాట ప్రిన్స్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు. అయితే వారి అభిరుచికి తగ్గ బొమ్మ పడితే తమిళ బాక్సాఫీస్ కూడా కళకళలాడుతుంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories