‘స్పైడర్’ సినిమా ఫలితమా ఇది?

Mahesh Babu Team Official Twitter Accountప్రిన్స్ మహేష్ బాబు గురించి అధికారిక వార్తలు తెలుసుకోవాలనుకుంటున్నారా? మహేష్ కు స్వయంగా ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాలు ఉన్నప్పటికీ, వాటి నుండి రెగ్యులర్ సమాధానాలు గానీ, సమాచారాలు గానీ రావు. ఏదో సినిమా విడుదల సమయంలో ఒకటి రెండు సందేశాలు తప్ప మహేష్ అఫీషియల్ ఖాతాల వలన అభిమానులకు పెద్దగా ప్రయోజనం లేదు. ముఖ్యంగా ‘స్పైడర్’ సినిమా పరాజయంలో సోషల్ మీడియా కూడా ఓ భాగం కావడంతో, ప్రిన్స్ అభిమానుల నుండి సోషల్ మీడియా పీ.ఆర్. టీం కావాలన్న డిమాండ్ వెళ్ళింది.

ADVERTISEMENT

బహుశా వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్నారేమో గానీ, మహేష్ బాబు అఫీషియల్ న్యూస్ ను తెలియచెప్పడానికి ట్విట్టర్, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ తదితర సోషల్ సోషల్ మీడియాలలో ఖాతాలను ఓపెన్ చేసారు. అయితే ఇది అధికారికమో కాదో ఇంకా ఖరారు కాలేదు గానీ, ప్రిన్స్ అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో సదరు ఖాతాలకు సంబంధించిన లింక్స్ ను షేర్ చేసుకుంటూ హంగామా చేస్తున్నారు. ‘స్పైడర్’ సినిమా రిజల్ట్ రీత్యా… ఫ్యాన్స్ కోరిక మేరకు మహేష్ పీఆర్ టీంను నిజంగానే అప్పాయింట్ చేసుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది.

ADVERTISEMENT
Latest Stories