మహేష్ తో సినిమాపై ప్రకటన వచ్చింది!

Mahesh Babu Vamsi Paidipally PVP Movie Starts 2017‘బ్రహ్మోత్సవం’ సినిమాతో దారుణ పరాజయం చవిచూసిన కాంభినేషన్ పివిపి – ప్రిన్స్ మహేష్ బాబుది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ నష్టాలను మిగల్చడంతో, వాటిని భర్తీ చేసేందుకు ప్రిన్స్ నడుం కట్టారని, మళ్ళీ పివిపితో ఓ సినిమా చేయబోతున్నారని ప్రచారం జరుగుతున్న సమయంలోనే, మహేష్ పుట్టినరోజున పివిపి సంస్థ నుండి ఓ పోస్టర్ విడుదలైంది.

ADVERTISEMENT

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ హీరోగా ఓ సినిమాను నిర్మించబోతున్నామని పివిపి సంస్థ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పటినుండి ఇప్పటివరకు ఆ సినిమాకు సంబంధించి ఇతర విషయాలేవీ తెలియరాలేదు. మరో పక్కన ప్రిన్స్ కమిట్మెంట్స్ పెరిగిపోతూ ఉండడంతో, ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాలుస్తుందో లేదోనన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.

అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ పై నిర్మాత పివిపి ఓ అధికారిక ప్రకటన చేసారు. “కాష్మోరా” పబ్లిసిటీలో ఉన్న పివిపిని మీడియా వర్గాలు మహేష్ తో సినిమా గురించి ప్రశ్నించగా, ‘వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 2017వ సంవత్సరంలో ఈ సినిమా ప్రారంభమవుతుందని’ స్పష్టత ఇచ్చారు. అంతేకాదు, తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపుదిద్దుకుంటుందని కూడా తెలియజేయడంతో, మురుగదాస్ తర్వాత ప్రిన్స్ నటించే మరో సినిమా రెండు భాషల్లో తెరకెక్కనుందని ఖరారయ్యింది.

ADVERTISEMENT
Latest Stories