సోషల్ మీడియాలో చాలా అరుదుగా మాత్రమే దర్శనమిచ్చే ప్రిన్స్ మహేష్ బాబు, ప్రస్తుతం కుటుంబంతో కలిసి స్విట్జర్లాండ్ లో హాయిగా గడుపుతున్న విషయం తెలిసిందే. జనవరి 1వరకు మహేష్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా సందడి చేయగా, ఆ తర్వాత చిరు సినిమా ప్రమోషన్ లో భాగంగా చెర్రీ తిరిగి వచ్చేసాడు. ఆ తర్వాత కొడుకు గౌతమ్, కూతురు సితారతో కలిసి స్విస్ మంచుకొండల్లో ప్రిన్స్ ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి.
ఈ ట్రిప్ లో భాగంగా ప్రిన్స్ ఓ ‘సూపర్’ ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. ఓ పక్కన మహేష్, మరో పక్కన గౌతమ్… ఇద్దరో ఒకే భంగిమలలో పక్కపక్కన నడుస్తున్న ఈ ఫోటో అభిమానులను కన్నులవిందుగా మారింది. బ్లాక్ అండ్ వైట్ లో దర్శనమిస్తున్న ఈ ఫోటోలోని ఫోజులకు ఫ్యాన్స్ ఫిదా కావడంతో, సదరు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భవిష్యత్తులో తండ్రి అడుగుజాడల్లోనే గౌతమ్ కూడా నడవబోతున్నట్లుగా ఈ ఫోటో ఉందంటూ ప్రిన్స్ అభిమానులు మురిసిపోతున్నారు.



