మహేష్ ను ద్వేషించే వాళ్ళకు ఓ దండం!

Mahesh Babu, Suriya, & Ranbir Kapoor Across Industries Sailing On Disaster Boat!“స్పైడర్” సినిమాపై ఉన్న నెగటివ్ టాక్ తో విసిగిపోతున్న ప్రిన్స్ అభిమానగణాల్లో తాను ఒకరినని బుల్లితెర యాంకర్ కం నటిమణి అయిన శ్రావ్యరెడ్డి పరోక్షంగా చెప్పకనే చెప్తోంది. అంతేకాదు మహేష్ ను వ్యతిరేకించే వారికి ఓ దండం కూడా పెట్టేసింది. బుధవారం నాడు ఉదయమే మొదలుపెట్టిన ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. “హో మై గాడ్… మహేష్ ను, ఆయన సినిమాను ఈ స్థాయిలో ద్వేషిస్తున్న వారంతా నిజంగా జబ్బుతో ఉన్నట్లుగా కనిపిస్తోంది, మీరు త్వరగా కోలుకోవాలని భావిస్తున్నాను” అంటూ ట్వీట్ చేసింది.

తన ద్వేషాన్ని, ఆగ్రహాన్ని ప్రదర్శించడానికి మహేష్ బాబు ఎవరిని అప్పాయింట్ చేసుకోలేదని, ఇండస్ట్రీలో మహేష్ కున్న క్లీన్ ఇమేజ్ మరొకరికి లేదని తెలిపింది. తన సినిమాల కోసం ఎంతో డెడికేషన్ తో మహేష్ పని చేస్తారని, దర్శకులను కూడా అదే స్థాయిలో నమ్ముతారని, తన ఫెయిల్యూర్స్ విషయంలో ఎలాంటి కంప్లైంట్స్ గానీ, ఇంకొకరిని నిందించడం గానీ ఎప్పుడు జరగలేదని కాస్త గట్టిగానే చెప్పింది. ఎలాంటి కారణం లేకుండా మహేష్ పై ద్వేషం పెంచుకుంటున్నారని, అభిమానం ఉంటే వారిపై ప్రేమను చూపించండి, ద్వేషాన్ని కాదు… అంటూ సందేశాన్ని కూడా ఇచ్చింది.

ADVERTISEMENT

ఉన్నట్లుండి మహేష్ బాబుపై ఇంతగా అభిమానాన్ని కురిపిస్తోన్న ఈ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా… మహేష్ ను కాస్త దగ్గర నుండే చూసిందిలేండి. “శ్రీమంతుడు” సినిమాలో హీరోయిన్ శృతిహాసన్ స్నేహితురాలిగా నటించిన బ్యూటీ ఈ శ్రావ్యరెడ్డినే. బహుశా ప్రస్తుతం సెట్స్ పైనున్న కొరటాల సినిమాలో కూడా చేస్తుందో ఏమో గానీ, “స్పైడర్” సినిమా బాగుందంటూ తొలి రోజు నుండి తన సోషల్ మీడియా ఖాతాలో ప్రచారం చేసింది. ఇంతకీ ఎవరిని ఉద్దేశించి శ్రావ్య ఈ వ్యాఖ్యలు చేసింది? అన్నది మాత్రం హాట్ టాపిక్ అయ్యింది.

ADVERTISEMENT
Latest Stories