పూనం కౌర్ పైకి కత్తి విసిరిన 6 అవాక్కయ్యే ప్రశ్నలు!

Kathi Mahesh - Poonam Kaurఆదివారం ఉదయం నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లోకి వచ్చిన కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలకు వేదిక అయ్యారు. ఇప్పటివరకు బాహ్య ప్రపంచానికి తెలియని విషయాలను లేవనెత్తి, అదంతా హాట్ టాపిక్ అయ్యేలా చేసారని చెప్పడంలో సందేహం లేదు. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ను ప్రశ్నిస్తూ వస్తోన్న కత్తి మహేష్ ను పూనం కౌర్ బిచ్చగాడిగా అభివర్ణించిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన కత్తి మహేష్, తన భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతోనే ఓ 6 ప్రశ్నలను సంధిస్తున్నానని, వీటికి పూనం కౌర్ దగ్గర నుండి సమాధానాలు కావాలని, ఈ ప్రశ్నలపై ఎన్ని కోట్లు పరువు నష్టం దావా వేసుకున్నా పర్లేదు, నిరూపించడానికి తగ దగ్గర సాక్ష్యాలున్నాయంటూ చెప్పడం సంచలనంగా మారింది.

ADVERTISEMENT

ఇంతకీ కత్తి విసిరిన ఆ ప్రశ్నలేంటో తెలుసా..?

1.మీకు బ్రాండ్ అంబాసిడర్ గా పదవి ఎవరి వలన వచ్చింది?

2.తిరుమలలో పవన్ కళ్యాణ్ తో పాటు నిలబడి ఒకే గోత్ర నామాలతో మీరు పూజ ఎందుకు చేయించుకున్నారో చెప్పగలరా?

3.పవన్ మోసం చేసాడనే బాధతో మీరు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే… మిమ్మల్ని కాపాడింది ఎవరు? మీరు ఉన్న హాస్పిటల్ ఏంటి? ఆ బిల్స్ కట్టింది ఎవరు?

4.పవన్ కళ్యాణ్ గారు మీ అమ్మ గారిని కలిసి ఏం ప్రామిస్ చేసారు? ఇప్పటివరకు అది నెరవేర్చారా? లేదా?

5.డైరెక్టర్ త్రివిక్రమ్ గారంటే మీకు ఎందుకండి అంత కోపం?

6.ఒక క్షుద్ర మాంత్రికుడు నరసింగం చేసిన క్షుద్ర పూజ త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ తో కలిపి అక్కడ మీరు ఏం చేసారో చెప్పగలరా?

ఈ ఆరు ప్రశ్నలను మీడియా ముఖంగా అడుగుతున్నాను. సమాధానం చెప్తే చర్చకు నేను రెడీ… అంటూ కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు సెన్సేషన్ గా మారింది. ఇంత ధైర్యంగా మహేష్ కత్తి అడిగారంటే ఇందులో వాస్తవం ఉందని నమ్మాలా? లేక సంచలనం కోసమో, పబ్లిసిటీ కోసమో ఈ రేంజ్ లో ఆధారాలు లేని ఆరోపణలు, ప్రశ్నలు చేస్తారా? దీంతో కత్తి మహేష్ చేస్తోన్న వ్యాఖ్యలకు సీన్ లోకి వచ్చిన పూనం కౌర్ తో అసలు విషయం పక్కదారి పట్టగా, త్వరలో ఏం జరగబోతోంది? అన్న ప్రశ్నలు వీక్షకుల మదిలో మెదులుతున్నాయి. మరి వీటికి సరైన రీతిలో పూనం కౌర్ నుండి గానీ, పవన్ వర్గం నుండి జవాబులు లభిస్తాయో లేదో చూడాలి. ఇవేమీ సాధారణ ప్రశ్నలు, ఆరోపణలు అయితే కావు. వీటిని ఎంత త్వరగా శుభంకార్డు వేయగలిగితే ‘పవన్ అండ్ కో’కు అంత లాభం అని చెప్పాలి.

ADVERTISEMENT
Latest Stories